బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి
ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.
వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..’నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్‌లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు.