Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబును ఈ పక్కన తంతే ఆ పక్కన పడతాడు : వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు అత్యంత వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. యావత్ తెలుగుదేశం పార్టీ నేతలు అంతా కడప గడపలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు.

కడప అంతా పసుపుమయంగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో టీడీపీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఈ పక్క తంతే ఆ పక్క పడతాడు అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా రాదు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ జోస్యం చెప్పారు. డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ…అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ…శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని మాజీ సీఎం జగన్ కొత్త నిర్వచనం చెప్పుకొచ్చారు.వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాంవైసీపీ అధినేత, మాజీసీఎం వైఎస్ జగన్ టీడీపీ, సీఎం చంద్రబాబు నాయుడులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి పాలనలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. ‘మీ ఇష్టం వచ్చిన బుక్‌లో పేరు రాసుకోండి అని జగన్ చెప్పుకొచ్చారు. మనం వచ్చాక వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. అన్యాయం చేసిన వాళ్లకు మాత్రమే కాదు.. కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్లను కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. జగన్ 2.Oలో సంక్షేమం, అభివృద్ధి కంటే కార్యకర్తలకే అత్యధిక ప్రధాన్యత ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో రాజ్యాంగ ఉల్లంఘనకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు…అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు పెట్టినట్లు ఆరోపించారు. టీడీపీ హయాంలో చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుని ప్రజలు ఈ పక్క తంతే ఆ పక్క పడతాడని…కనీసం వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్‌లు కూడా దక్కవు అని చెప్పుకొచ్చారు. రేపు ఎలా ఉంటుందో మేం చెప్తాంమరోవైపు మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్‌పైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్ అక్రమం అని చెప్పుకొచ్చారు. ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇచ్చినా మాజీ మంత్రి కాకాణిని అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష పార్టీలు అని కూడా చూడలేదు అని చెప్పుకొచ్చారు. మన పార్టీ వాళ్లు కాదని మన ఎమ్మెల్యేలు వద్దు అన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం మంచి చేయించాం అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అయితే కూటమి ఏడాది పాలనలో ఎన్నో పాఠాలు నేర్పించారని… రేపు ఎలా ఉంటాదో తాము చెబుతాం అంటూ వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహానాడులో జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుపైనా వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సత్తా అవుతుంది కానీ కడపలో మహానాడు పెట్టడం సత్తా కాదు అని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది నిజమైన సత్తా అవుతుందని అంతేకానీ మహానాడులో జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది అని వైఎస్ జగన్ నిలదీశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను మరిచి సీఎం చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుది దౌర్భాగ్యపు పాలన అని జగన్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కార్యకర్తలను గడపగడపకు తిప్పే ధైర్యముందని మహానాడు వేదిక పైనుంచి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పగలరా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.

 

Related posts

కానిస్టేబుల్పై దాడి.. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్

M HANUMATH PRASAD

విజయనగరాన్ని సిరాజ్ ఎందుకు ఎంచుకున్నాడంటే?

M HANUMATH PRASAD

మాజీ సీఎం జగన్ VS డిప్యూటీ సీఎం పవన్

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్‌.. పదవి నుండి తొలగింపు..

M HANUMATH PRASAD

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు

పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్‌

M HANUMATH PRASAD