కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడం లేదు. బస్టాండ్, రైల్వేలు, మెట్రోలు, రద్దీ ప్రదేశాల్లో మహిళల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు.
ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడం లేదు. బస్టాండ్, రైల్వేలు, మెట్రోలు, రద్దీ ప్రదేశాల్లో మహిళల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ.. మే 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ ఇరుకైన సందులో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమెకు ఎదురుగా వచ్చాడు. ఆమె అతడ్ని గమనించలేదు. తన దారిన తాను వెళ్తుంది. ఇంతలో ఆ కామాంధుడు ఒక్కసారిగా యువతి ముందుకు స్పీడ్ గా వచ్చి బైక్ ఆపి.. ఆమెను గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ హఠాత్పరిమాణంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే తెరుకుని గట్టిగా కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఘటనపై ఆరాతీశారు. ఈ దారుణం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
వెంటనే పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు.. బైక్ నంబర్ ఆధారంగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో తప్పైపోయిందని.. జీవితంలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయనని కూడా ఆ యువకుడిని చావబాదిన వీడియో ఒకటి పోలీసుల రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది.