Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్.. కార్యకర్త భావోద్వేగం

చిత్తురు జిల్లా కుప్పం వచ్చి గత రెండురోజులుగా బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నాటీడీపీ వీరాభిమాని చెంగాచారికి కలిశారు.

కుప్పం నుంచి కడప మహానాడుకు బయలుదేరిన యువనేత లోకేష్ సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా టీకొట్టు వద్దకు వెళ్లాడు. అన్నా… చాలా దూరం వెళ్లాలి… టీ ఇస్తావా అని అడిగాడు లోకేష్.

చెంగాచారికి కొద్దిసేపు నోటమాట రాలేదు. తమ అభిమాననేత నేరుగా తమ కొట్టుకురావడంతో సంభ్రమాశ్చార్యానికి లోనయ్యాడు. యువనేత లోకేష్ కు టీ గ్లాసు అందించాడు. వ్యాపారం ఎలా ఉందని అడగ్గా చెంగాచారి స్పందిస్తూ…

సర్… నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా. చంద్రబాబు గారంటే అభిమానం. నేను టిడిపికి చెందిన వాడినన్న కోపంతో గత అయిదేళ్లుగా నా టీ అంగడిని మూయించేశారు.

గత ఏడాది జూన్ 12న చంద్రబాబు గారు సిఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వతేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించా. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒకబిడ్డకు పెళ్లయింది… మరో కూతురికి పెళ్లి చేయాలి. మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

చెంగాచారి భుజం తట్టిన యువనేత లోకేష్… ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేనున్నా… ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగారు. కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యత నిస్తారనడానికి ఇదొక మచ్చుతునక.

Related posts

ఏపీలో ఆకాశం నుంచి కింద పడుతోన్న మేఘాలు.. వైరల్ అవుతోన్న వీడియోలు. ఇంతకీ ఏం జరుగుతోంది.?

M HANUMATH PRASAD

వల్లభనేని వంశీకి అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు?

M HANUMATH PRASAD

బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!

M HANUMATH PRASAD

ఏపీలో కొత్త రైల్వే లైన్‌.. ఈ రూట్‌లోనే, హైదరాబాద్ నుంచి తిరుపతి త్వరగా వెళ్లొచ్చు.. లైన్ క్లియర్

M HANUMATH PRASAD

రెడ్ బుక్ మరువను..! కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారిని వదలను..

M HANUMATH PRASAD

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

M HANUMATH PRASAD