Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

అప్పట్లో అప్పలరాజు తిట్టాడు.. ఇప్పుడు పోలీసులు తిట్టారు !

నువ్వు ఏది ఇస్తే అది రివర్స్ లో నీకే వస్తుందని అంటారు. అప్పలరాజు విషయంలో ఇది మరోసారి నిరూపితమయింది. ఆయన ఓ సారి విశాఖలో జగన్ కార్యక్రమంలోకి పోనివ్వలేదని చెప్పి పోలీసులపై బూతులందుకున్నారు.

అప్పట్లో పోలీసులు ఏమీ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆయన వైసీపీ ఎమ్మెల్యే. మామూలుగా ఆ ప్రోగ్రాంలోకి అప్పలరాజును పంపించారు. కానీ ఆయన తన అనుచరుల్ని కూడా తీసుకెళ్తానని పట్టుబట్టారు. కానీ పోలీసులు పోనివ్వలేదు. అందుకే తిట్లందుకున్నారు.

ఇప్పుడు అప్పలరాజుకు అలాంటి ఘటన రివర్స్ లో వచ్చింది. ఓ పోలీసు అధికారి ఆయనపై బూతులందుకున్నారు. వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఓ గ్రామంలో వివాదానికి సంబంధించి గ్రామస్తులు వెళ్లారు. వైసీపీ నేతలు తమపై టీడీపీ నేతలు దాడి చేశారని కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ అసలు దాడి చేసింది వైసీపీ నేతలేనని వారు రివర్స్ అయ్యారు. ఈ క్రమంలో అప్పలరాజు పోలీస్ స్టేషన్ వద్దకు యథావిధిగా పోలీసులపై రుబాబు చేయబోయారు. కేసు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. అప్పలరాజు తీరుతో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు సీఐ అసహనానికి గురై బూతులందుకున్నారు.

నన్ను తిడతావా అని అప్పలరాజు ఫీలై ఉండవచ్చు కానీ.. గతంలో పోలీసుల్ని అంత కంటే ఎక్కువగానే ఆయన తిట్టాడు. పోలీసుల్ని బానిసలుగా చూశాడు. ఇప్పుడు ఆయనకు ఇది రివర్స్ లో ఎదురొచ్చింది. అందుకే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటారు.

Related posts

మళ్లీ వైసీపీ రాదు. రానివ్వను.. పిచ్చి వేషాలేస్తే తొక్కినారా తీస్తా: పవన్ కళ్యాణ్

M HANUMATH PRASAD

విజయసాయి.. చంద్రబాబుకు లొంగిపోయాడు..

M HANUMATH PRASAD

వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదు: భార్య పంకజశ్రీ

M HANUMATH PRASAD

స్నానానికి వెళ్ళి సముద్రంలో ఇద్దరు గల్లంతు

M HANUMATH PRASAD

మంగుళూరులో హిందూ కార్యకర్త దారుణ హత్య

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

GIT NEWS