Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

37 వేల మంది పౌరసత్వం రద్దు–కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం

రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్‌ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది.

ఇలా షాక్‌ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. పౌరసత్వ రద్దు బాధితులలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. పదులు, వందలు కాదు ఏకంగా 37 వేల మందిపై కువైట్‌ దేశ బహిష్కరణ వేటు వేసింది.

ఆగస్టు నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో జాతీయతను కోల్పోయిన వారిలో 26 వేల మంది మహిళలు ఉన్నారని, వీరంతా వివాహం ద్వారా పౌరసత్వ హక్కు పొందిన వారని, బహిష్కరణకు గురైన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అలాగే ద్వంద్వ, అక్రమ మార్గాల్లో పొందిన పౌరసత్వాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

Related posts

కిరానా హిల్స్‌లో అమెరికా అణుస్థావరం!

M HANUMATH PRASAD

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

M HANUMATH PRASAD

పాక్ తరుఫున పోరాడిన తుర్కియే సైనికులు.. ఇద్దరు హతం.. తీవ్ర కలకలం

M HANUMATH PRASAD

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్‌

M HANUMATH PRASAD

పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?- ఎంత వరకు నిజం?

M HANUMATH PRASAD

14 మంది పాక్ సైనికులు హతం…వీడియో రిలీజ్ చేసిన బలూచ్

M HANUMATH PRASAD