ప్రముఖ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ని ఉద్దేశిస్తూ.. పవన్ పై విమర్శలు గుప్పిస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్ బంద్ పై సినిమా ఫిలిం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా తమ వద్దకు రాకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే ఒక బహిరంగ లేఖ వదులుతూ తెలుగు చిత్రశ్రమ మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి .. ఏడాది కావస్తున్నా.. తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను అసహ్యంగా చూసింది. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయినట్లున్నారు. ఇకపై ఎన్డీఏ ప్రభుత్వంతో సినిమా వాళ్లకు వ్యక్తిగత చర్చలు ఉండవు. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా అభివృద్ధి ని మాత్రమే చూస్తుంది అంటే కామెంట్ చేశారు. దీంతో ఈ రిటర్న్ గిఫ్ట్ పైనే ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా చిట్టిబాబు(Producer Chitti Babu) మండిపడ్డారు.
రిటర్న్ గిఫ్ట్ పై పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ చిట్టిబాబు..
చిట్టిబాబు మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులు, బ్లాక్మెయిల్, నీ ప్రతాపం సినిమా వాళ్ల మీద చూపించకుండా ముందు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వెయ్యి.. నువ్వు ఒక అబద్ధాల కొరివి. నువ్వు చెప్పే మాటలన్నీ కూడా అధికారం కోసమే. ప్రజలను మోసం చేశావు. రాజకీయాల్లోకి రాకముందు జగన్ ప్రభుత్వంలో 32,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పావు. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చాక ఆ 32,000 మంది అమ్మాయిల ఆచూకీ ఎక్కడ.. ? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నా ప్రాణం అడ్డు వేస్తానని చెప్పావు. ఇప్పటికే మూడు ఫ్యాక్టరీలు వెళ్ళిపోయాయి. ఇంకొకటి కూడా త్వరలో మూసివేసే అవకాశం ఉంది. తిరుపతిలో పాచిపోయిన లడ్డులు అని చెప్పాడు. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి సమాధానం ఏది.. ?అటు కాకినాడలో 25 టన్నుల గంజాయి దొరికింది. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారు అంటూ అప్పుడు గొంతు చించుకొని అరిచావే. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అది గంజాయి కాదు డ్రై ఐస్ అంటూ నివేదికలు ఇచ్చారు కదా.. మరి దీనికి మీ సమాధానం ఏమిటి..? ఇతరులను ఇరకాటంలో పెట్టేందుకు, అధికారంలోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఎంతకైనా తెగిస్తారు. అప్పుడు అధికారంలోకి రావడానికి బహిరంగ సభలలో కూడా అందరిని అట్రాక్ట్ చేసేలా మాట్లాడాడు. కానీ ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగితే మాత్రం దాని గురించి మాట్లాడటం లేదు అని తెలిపారు. అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ మాయ చేసారు. మరి వాటన్నింటికీ సమాధానం చెప్పండి.
ఇచ్చిన హామీలు నెరవేర్చు.. పవన్ పై చిట్టిబాబు ఫైర్..
ఇక ప్రజల కోసం హామీలు ఇచ్చారు కదా.. ఇప్పటివరకు నిరుద్యోగ భృతి లేదు.. పిల్లలకు అమ్మబడి లేదు.. ఉచిత బస్సు అన్నారు.. దాని ఊసే లేదు.. ఉచిత గ్యాస్ సిలిండర్ అంటున్నారు .మళ్ళీ రూ.1700 కట్టించుకుంటున్నారు. దీనినా ఉచిత గ్యాస్ పథకం అనేది అంటూ పవన్ కళ్యాణ్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేలా కామెంట్లు చేశారు చిట్టిబాబు. ప్రస్తుతం చిట్టి బాబు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.