వక్ఫ్ సవరణ చట్టానికి(Waqf Amendment Act) నిరసనగా హైదరాబాద్‌లో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలు(MIM MLAs) మానవహారం నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో మానవహారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం(NDA Govt) వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. వక్ఫ్ అనేది ఇస్లాంలో అంతర్భాగం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇటీవల తెలిపింది.
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ ఆస్తుల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని, వాటిని స్వాధీనం చేసుకుంటారనే ప్రచారం అవాస్తవమని కేంద్రం పేర్కొంది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని కూడా సమర్థించింది. ఈ చట్టంపై పిటిషనర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.