Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రీడా వార్తలు

గిట్ల ఆడినవ్ ఏంది కాకా..!!

ఐపీఎల్ 2025 చిట్టచివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విశ్వరూప ప్రదర్శన చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఎలా ఆడిందో.. అదే తరహాలో చెలరేగింది.

కోల్ కత నైట్ రైడర్స్ బౌలర్ల దుమ్ము దులిపింది. మరోసారి స్కోర్ బోర్డుపై భారీ స్కోరును జమ చేసింది ఆరెంజ్ ఆర్మీ.

నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కోల్ కత నైట్ రైడర్స్ కు 279 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐపీఎల్ లో 250కి పైగా పరుగులు చేయడం సన్ రైజర్స్ కు ఇది అయిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ జట్టు ఇన్నేసిసార్లు 250కి పైగా పరుగులు చేయడం ఐపీఎల్ మొత్తానికీ ఇదే తొలిసారి.

సన్ రైజర్స్ బ్యాటర్ల ప్రతాపానికి కోల్ కత బౌలర్లు చేతులెత్తేశారు. ఎలా బంతులు వేయాలో తెలియక తల పట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం చేష్టలుడిగిపోయారీ మ్యాచ్ లో. ఎలా వేసినా కూడా ఆ బంతులన్నింటినీ బౌండరీ లైన్లు, ఫెన్సింగులు దాటించారు.

ఎన్రిచ్ నోర్ట్జె, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఆండ్రీ రస్సెల్.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లందరి ఎకానమీ 10కి పైగా నమోదైందంటే సన్ రైజర్స్ బ్యాటర్ల దూకుడు ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి- ఆండ్రీ రస్సెల్. రెండు ఓవర్లల్లోనే 34 పరుగులు ఇచ్చుకున్నాడీ ఆల్ రౌండర్. కోల్ కత బౌలర్లల్లో సునీల్ నరైన్- 2, వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్ లో సునామీని తలపించేలా బ్యాటింగ్ చేశాడు హెన్రిచ్ క్లాసెన్. 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాటౌట్ గా నిలిచాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. కోల్ కత ఇన్నింగ్ లో ప్రతి బౌలర్ కూడా క్లాసెన్ కాకా బాధితుడే. అబ్జల్యూట్ క్రికెటింగ్ షాట్లతో విరుచుకుపడ్డాడు.

కంప్లీట్ మాస్టర్ మాస్ బ్యాటింగ్ చేశాడు. ఒక్కో షాట్ ఒక్కో పిడుగులా కనిపించి ఉండొచ్చు కోల్ కత బౌలర్లకు. ఐపీఎల్ లో ఇది మూడో జాయింట్ ఫాస్టెస్ట్ హండ్రెడ్. అంతకుముందు- ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. మ్యాడ్ బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 32, ట్రావిస్ హెడ్- 40 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు బౌండరీలు బాదాడు. ఇషాన్ కిషన్- 29, అనికేత్ వర్మ- 6 పరుగులు (నాటౌట్) చేశారు.

Related posts

ఇదికదా మ్యాచ్ అంటే.. నరాలు తెగే ఉత్కంఠ

SIVANANDA BHAGAVATI

RCB vs PBKS: 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ.. ఆర్సీబీ గెలుపులో ముగ్గురు హీరోలు

వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు ఘోర అవమానం.. క్రికెట్‌లో ఒకే రోజు రెండు మిరాకిల్స్

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు మరో ఎదురుదెబ్బ

ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలివే!

రోహిత్ కాదు.. ఆ ఇద్దరి వల్లే కెప్టెన్‌గా నా పని ఈజీ అవుతోంది: హార్దిక్ పాండ్యా