Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఐదు నిర్మాణాలకు కూల్చివేసిన హైడ్రా సిబ్బంది..

తాజాగా జూబ్లీహిల్స్‌లో బేసీబీలకు పనిచెప్పారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న నాలాపై ఆక్రమణలను తొలగిస్తున్నారు.నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఈ సందర్భం భారీగా పోలీసులు మోహరించారు.

తాజాగా జూబ్లీహిల్స్‌లో బేసీబీలకు పనిచెప్పారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న నాలాపై ఆక్రమణలను తొలగిస్తున్నారు.

నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఈ సందర్భం భారీగా పోలీసులు మోహరించారు.

కాగా, మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని పర్వతాపూర్‌ పరిధిలో గురువారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎలాంటి సమాచారం అందించకుండా బాధితులు ఎంతగా వేడుకున్నా.. సమయం ఇవ్వాలని కోరినా..కనికరించకుండా అనుమతులు ఉన్న ఐదు నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో పాటు తమ ఊర్లలో ఉన్న భూములను అమ్మితే వచ్చిన డబ్బులతో స్థలం కొనుగోలు చేసుకుని నిర్మాణాలు చేసుకుంటే హైడ్రా పేరిట తమ జీవితాలను రోడ్డున పడవేశారని బాధితులు ఆరోపించారు. కేసీఆర్‌ పాలననే బాగుండేనని చెప్పిన బాధితులు.. కాంగ్రెస్‌ పాలనపై దుమ్మెత్తిపోశారు. రేవంత్‌రెడ్డికి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

Related posts

ఎమ్మెల్సీ కవిత అలా చెప్పింది.. ఎంపీ చామల షాకింగ్ కామెంట్స్

M HANUMATH PRASAD

సొంత పార్టీ వాళ్లే ఓడించారు.. భారాస ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

M HANUMATH PRASAD

హైదరాబాద్‌ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదే

M HANUMATH PRASAD

150 కోట్లు స్వాహా చేసిన సెక్యూరిటీ సంస్థ

M HANUMATH PRASAD

ఆత్మాహుతికి సిద్ధమైన సమీర్‌, సిరాజ్‌! దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక

M HANUMATH PRASAD