వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.
లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ చేయాలని నీ సొంత సోదరి షర్మిల చెబుతుంది. లిక్కర్ ఒప్పందాలపై నా సంతకం ఉందా..? అని జగన్ సవాళ్లు విసురుతున్నారు. ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపే నైతిక హక్కు జగన్ కు లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరు పురుగు పట్టింది. అందుకే ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోయాడు. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంట్రుక పీకడం కాదు.. మా బీజేపీతో పెట్టుకుంటే తిరుమల గుండే. త్వరలో సీబీఐ కేసులో జగన్ జైలుకెళ్లడం ఖాయం.. వివేకా హత్య కేసులో త్వరలో ఎంపీ అవినాశ్ జైలుకెళ్తాడు.ఏపీ రాజకీయాల్లో జగన్ నామరూపాలు లేకుండా చేయడమే మా ధ్యేయం అంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అమృత పథకం ద్వారా త్వరలో బద్వేల్ నుండి కడపకు నీళ్లు.