Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

హిందూ మతాన్ని వీడారు.. దేశ ద్రోహానికి పాల్పడ్డారు.. బయటపడ్డ సంచలన నిజాలు..!!

జ్యోతి మల్హోత్రా సంఘటన అనంతరం ప్రస్తుతం పాకిస్తాన్ కుట్రలకు కుతంత్రాలకు మన దేశం గడ్డపై జన్మించిన పౌరులు కూడా ఊతం అవుతున్నారని స్పష్టం అవుతోంది.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరిలో చాలామంది హిందూమతంలో జన్మించినప్పటికీ తర్వాత అనేక కారణాలవల్ల మతాంతరీకరణ జరిగి ఉగ్రవాద కార్యకలాపాల్లోకి ప్రవేశించిన వారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారిలో 15 మంది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

1. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొనకల్ల సుబ్రహ్మణ్యం అలియాస్ ఉమర్ 2017 మే 19వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. ఇతను 2014లో ఇస్లాం మతం తీసుకొని గుజరాత్ శ్రీనగర్ తమిళనాడులోని కొన్ని మదర్సాలలో చదువుకున్నాడు. ఆ తరువాత ఐసిస్ టెర్రరిస్టు సంస్థలో చేరి విధ్వంసక కార్యకలాపాలకు ప్లాన్ చేశాడు. దీంతో పోలీసులు ఇతని కుట్రలను గమనించి అరెస్టు చేశారు.

2. గుజరాత్ కు చెందిన అబూబకర్ అలియాస్ అశోక్ సుధీర్ సైతం మతం మారిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇతను హనీ ట్రాప్ వల్ల ఉగ్రవాదుల టచ్ లోకి వెళ్ళాడు. ఆ తర్వాత మతం మారి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో జాతి వ్యతిరేక పనులకు దిగాడు. ఇది గమనించిన పోలీసులు రాజస్థాన్ లో మే 24వ తేదీ 2024 లో అరెస్టు చేశారు.

3. హర్యానాలోని పానిపట్టుకు చెందిన అనురాగ్ అలియాస్ రెహాన్ సైతం మతం మారిన అనంతరం ఉగ్రవాదిగా మారిపోయాడు. ఇతను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడు. ఐఐటి కోచింగ్ కోసం రాజస్థాన్లోని కోటాకు వెళ్లిన అనురాగ్ అక్కడే ఐసిస్ కు చెందిన కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకొని బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళను సైతం వివాహం చేసుకున్నాడు. చివరకు ఇతడిని అస్సాంలోని దుబ్రిలో పోలీసులు 22 మార్చి 2024 లో అరెస్ట్ చేశాడు.

4. జార్ఖండ్ కు చెందిన షహనాజ్ గుజరాత్ కు చెందిన బసంతి పటేల్ అన్న యువతిని వివాహం చేసుకొని మతం మార్పించి ఇద్దరు కలిసి ఉగ్రవాద చర్యలకు దిగారు. వీరిని పోలీసుల అరెస్టు చేయగా విచారణలో పలు దిగ్బ్రాంతి కరమైన విషయాలు బయటపడ్డాయి.

5. మధ్యప్రదేశ్లోని భోపాల్ కు చెందిన రాహుల్ సేన్ అలియాస్ ఉమర్ బహుదూర్ ను 2023 సెప్టెంబర్ 15వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి ఐ ఎస్ ఐ ఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాహుల్ సేన్ మతం మారిన అనంతరం ఉగ్రవాదంలో వద్ద శిక్షణ తీసుకొని, దేశంలో విధ్వంసక కార్యకలాపాలకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో పోలీసుల అరెస్ట్ చేశారు.

6. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన భూమిక అనే మహిళ కూడా తన స్నేహితుల ప్రభావంతో ఇస్లాం మతం తీసుకుని అనే ఒక ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది. అనంతరం దేశంలో ఉగ్రవాదకరపాలకు పాల్పడింది. ఈమెను పోలీసులు 28 మార్చి 2023 లో అరెస్టు చేశారు.

7. మధ్యప్రదేశ్లోని భోపాల్ కు చెందిన సౌరబ్ రాజ వైద్య అనే యువకుడు మత నాయకుడు జాకీర్ నాయక్ ప్రసంగాలకు ఆకర్షితుడై ఇస్లాం మతం తీసుకున్నాడు. అనంతరం అతని భార్య మానసి సైతం ఇస్లాం మతం తీసుకుంది. ఆ తర్వాత వీరి ఇరువురు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

8. కేరళలోని మల్లాపురంకు చెందిన మదేశ్ శంకర్ అలియాస్ అమిన్ సైతం ఇస్లాం మతంలోకి మారిన అనంతరం ఉగ్రవాద ఘటనలకు పాల్పడ్డారు. ఇతడు సోషల్ మీడియా వేదికగా ఐఎస్ఐఎస్ సంస్థ ప్రచార వీడియోలను ఎక్కువగా వ్యాపింప చేస్తున్నాడు. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.

9. కేరళకు చెందిన దీప్తీ మార్లా సైతం మంగళూరుకు చెందిన అబ్దుల్ రెహమాన్ ను వివాహం చేసుకొని మతం మారింది. అనంతరం ఆమె ఇరాన్ లోని తెహరాన్ కు చేరుకొని అక్కడ ఇస్లామిక్ తీవ్రవాదులతో చేతులు కలిపింది. ఏమని కూడా 2023 మార్చి 13వ తేదీ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

10. కేరళకు చెందిన నిమిషా మతం మారిన తర్వాత ఫాతిమాగా మారి మరో ముగ్గురితో కలిసి ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు గ్రూపులో జాయిన్ అయింది, ఫాతిమా అక్కడి నుంచి నేరుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుంది. తిరువనంతపురం లోని ఒక కోచింగ్ సెంటర్ లో వైద్యుడిగా పని చేసిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లామిక్ తీవ్రవాదంలోకి దింపినట్లు తెలిసింది. 2021 ఆగస్టు 17న ఫాతిమాను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

11. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శంకర్ వెంకటేష్ పెరుమాళ్ అలియాస్ అలీ ముయావియా మతం మారిన అనంతరం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద వీడియోలను ప్రచారం చేసి అమాయకులను ట్రాప్ చేసేవాడు. ఇతడిని పోలీసులు ఆగస్టు 4, 2021లో అరెస్ట్ చేశారు

12. తమిళనాడులోని మధురైకు చెందిన సెంథిల్ కుమార్ సైతం మతం మారిన అనంతరం ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు ఇతనిని 2021 మే 19న నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం వ్యాప్తి చేయడం వంటి చర్యలతో పాటు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు.

13. శ్రీలంకకు చెందిన పులస్తిని మహేంద్రన్ అలియాస్ సారా మతం మారిన అనంతరం ఇస్లామిక్ తీవ్రవాదుల వల్ల పడి ఉగ్రవాదం వైపు అడుగులు వేసింది 2019లో శ్రీలంకలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే ఆత్మహుతి దాడుల్లో మరణించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

14. కేరళకు చెందిన అఖిల అలియాస్ హదీయా మత మార్పిడి అనంతరరం ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. ఆమె తన స్నేహితురాళ్లు ఫసినా, జాసినాల ప్రభావానికి లోనై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి 9 అక్టోబర్ , 2017, కొట్టాయంలోఅరెస్టు అయ్యింది.

15. కలకత్తాకు చెందిన ఆయేషా జన్నత్ అలియాస్ ప్రగ్నా దేవ్ నాథ్ మతం మారిన అనంతరం బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ -ఎల్ -ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎమ్‌బి) తో సంబంధం పెంచుకుంది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

Related posts

భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందన్న కోర్టు!

M HANUMATH PRASAD

చంచల్ గూడ జైలులో ‘A’ క్లాస్ సౌకర్యాలు కల్పించండి – గాలి జనార్ధన రెడ్డి

M HANUMATH PRASAD

బ్రహ్మోస్’ కు జన్మనిచ్చిన దార్శనికుడి గురించి తెలుసా?

M HANUMATH PRASAD

లాయర్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారాం ఆసుపత్రికి తరలింపు..

M HANUMATH PRASAD

ముంబై ఎయిర్‌పోర్టులో కేఏ పాల్ హంగామా

M HANUMATH PRASAD