విజయసాయిరెడ్డి చంద్రబాబు లొంగిపోయాడని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకి మేలు చేసేందుకు విజయసాయం మూడున్నర సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నాడని అన్నారు. ప్రలోభాలకు లోనయ్యాడని ఆరోపించారు.
అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం విలువ ఉంటుందన్నారు. రాజ్ కేసిరెడ్డికి బేవరేజెస్ కార్పొరేషన్ కు ఏ సంబంధం అ న్నారు. టీడీపీ ఎంపీతో కలిసి ఆయన వ్యాపారాలు చేశారని అన్నారు. కృష్ణమోహన్, ధనుంజయ్, మిథున్ రెడ్డికి ఈ లిక్కర్ కేసుకి (Liquire Scam) ఏం సం బంధం అన్నారు.
తమ ప్రభుత్వం హయాంలో లాభాపేక్ష ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం విక్రయాలను చేసిందన్నారు. కానీ చంద్రబాబు (Chandrababu) నాయుడు ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో పెట్టి లిక్కర్ వ్యాపారం నడిపిం చారని అన్నారు. ఇప్పుడు బియ్యం డోర్ డెలివరీ చేయడం లేదు కానీ.. మందు డోర్ డెలివరీ చేస్తున్నారని అన్నారు. ఆ హయాంలో ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా కూడా ఎక్కువ అమ్మలేదన్నారు. ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పాలి అన్నారు.