Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: బండారు

ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

”నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా?. ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా” అంటూ బండారు వ్యాఖ్యానించారు.

మరో వైపు, టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.

Related posts

ఆపు నీ బెదిరింపులు–పవన్ పై చిట్టిబాబు ఫైర్..!

M HANUMATH PRASAD

ఆంధ్రాలో భారీగా తగ్గనున్న బంగారు ధరలు..గోల్డ్ మైన్‌లో బంగారం చీప్‌గా కొనేయోచ్చు?

M HANUMATH PRASAD

కానిస్టేబుల్పై దాడి.. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్

M HANUMATH PRASAD

తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి

M HANUMATH PRASAD

సీఎం చంద్రబాబు తొందర పడుతున్నారు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాచేపల్లి సీఐ దాష్టీకం

M HANUMATH PRASAD