Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

వడగళ్ల వానతో ఇండిగో విమానం ధ్వంసం.. వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో

ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్లుతున్న ఇండిగో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. వడగళ్ల వాన దెబ్బకు విమానం ధ్వంసం కావడంతో పాటు కుదుపులకు లోనైంది.

దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, తీవ్ర వాతావరణ ప్రతికూలతలకు గురై అత్యవసరంగా శ్రీనగర్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం శ్రీనగర్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నపుడు భారీ మోస్తరు గాలులతో కూడిన ఉరుములతో వర్షం మొదలైంది. వడగళ్లు పడటంతో విమానానికి ముందు భాగమైన ‘నోస్ కోన్’ (nose cone) ధ్వంసమైంది.

విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భారీ వర్షం విమానాన్ని తాకుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానం లోపల కుదుపులు తీవ్రమవుతుండగా, కొంతమంది ప్రయాణికులు భయంతో అరుస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రతికూలంగా ఉండటంతో పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించి అత్యవసర స్థితిని ప్రకటించాడు. అనంతరం శ్రీనగర్ విమానాశ్రయంలో సాయంత్రం 6.30 గంటలకు విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ల్యాండింగ్ అనంతరం విమానంలోని ప్రయాణికులందరూ, సిబ్బంది సురక్షితంగా విమానం నుంచి దింపారు. ఇండిగో సంస్థ దీనిని “ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్” (Aircraft on Ground – AOG)గా ప్రకటించింది. అంటే, మరమ్మత్తులు పూర్తయ్యేంత వరకు ఆ విమానం ఇక ప్రయాణానికి అనర్హమని అర్థం. ఎందుకంటే ఆ విమానం చాలా వరకు ధ్వంసం అయింది.

విమానం ఏ మేరకు దెబ్బతిన్నదని పరిశీలించేందుకు ఇండిగో అధికారులు, భద్రతా విభాగాలు ముమ్మర పరిశీలనలు చేపట్టారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడం ఊపిరిపీల్చుకునే విషయం కాగా, విమానయాన సంస్థల భద్రత ప్రమాణాలపై మరోసారి చర్చలు చెలరేగుతున్నాయి.

ఇండిగో సంస్థ ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, సమయోచితంగా పైలట్ తీసుకున్న నిర్ణయం వలన ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగినట్లు విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

బిహార్ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. కౌంటింగ్ ఎప్పుడంటే..?

M HANUMATH PRASAD

కాంగ్రెస్‌కు హార్ట్‌ బ్రేక్‌.. ఆర్టికల్ 370 రద్దు ప్రశంసనీయం.. హస్తం నేత వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

కొన్ని పాక్‌ జెట్‌లను కూల్చివేశాం.. ఐదుగురు సైనికులను కోల్పోయాం: త్రివిధ దళాధికారులు

M HANUMATH PRASAD

చంచల్ గూడ జైలులో ‘A’ క్లాస్ సౌకర్యాలు కల్పించండి – గాలి జనార్ధన రెడ్డి

M HANUMATH PRASAD

యూపీలో పెరుగుతున్న ‘లవ్ జిహాద్’ కేసులు

M HANUMATH PRASAD

పీఓకేను మనం దక్కించుకోబోతున్నాం : రాజ్ నాథ్ సింగ్

M HANUMATH PRASAD