Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
సినిమా వార్తలు

నెలకు రూ.40 లక్షల భరణం ఇవ్వు.. జయం రవి భార్య పిటిషన్..

తమిళ హీరో జయంరవి, అతని భార్య ఆర్తి వివాదం ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విడాకులు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పిటిషన్లు వేశారు.

తాజాగా ఆ కేసు విచారణకు ఇరువురూ కోర్టులో హాజరయ్యారు. కలిసి ఉండాలని అందుకోసం కౌన్సెలింగ్ కు హాజరు కావాలంటూ కోర్టు సూచించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తన భార్యతో కలిసి ఉండలేనని జయంరవి తెగేసి చెప్పేశాడు. దాంతో జయం రవి భార్య ఆర్తి కూడా అదే బాట పట్టింది

అయితే తనకు భరణం కింద నెలకు రూ.40లక్షలు ఇవ్వాలంటూ భార్య ఆర్తి పిటిషన్ వేసింది. దీనిపై విచారణను జూన్ 12కు వాయిదా వేసింది కోర్టు. ఈ పిటిషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జయం రవి అంత ఇవ్వడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాలి. కానీ భరణం కింద నెలకు అంత అంటే మరీ టూ మచ్ అంటున్నారు నెటిజన్లు. జయంరవి ఇప్పుడు సినిమాల పరంగా స్లో అయిపోయాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన నుంచి పెద్ద హిట్ వచ్చి చాలా రోజులు అవుతోంది.

ఇక జయం రవిపై భార్య, అత్త వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. తమను మోసం చేశాడని.. తమకు ఇష్టం లేకపోయినా విడాకులు ఇస్తున్నాడంటూ చెబుతున్నారు. జయం రవి అత్త తనను నిర్మాతగా సినిమాలు తీయాలంటూ చెప్పి.. వంద కోట్ల అప్పులు చేయించాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు తానే వాటిని తీరుస్తున్నాను అని చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పేది అవాస్తవాలే అంటూ జయంరవి చెబుతున్నాడు.

 

Related posts

స్టేజిపై ఏడ్చేసిన మంచు మనోజ్.. కట్టుబట్టలతో రోడ్డుపై పెట్టేశారు.. కార్లు లాగేసుకున్నారు

M HANUMATH PRASAD

బాలకృష్ణ అభిమానులకు ఊహించని షాక్..’అఖండ-2′ విడుదల వాయిదా

M HANUMATH PRASAD

పవన్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు.. కోమటిరెడ్డి వార్నింగ్..

M HANUMATH PRASAD

అలీ లం* కొడుకు ఎక్కడున్నాడు.. బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్..

M HANUMATH PRASAD

మీకు కనీస కృతజ్ఞత లేదు.. సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా రావద్దు: డిప్యూటీ సీఎం పవన్‌

M HANUMATH PRASAD

రాజ్ తరుణ్ కు ఇల్లు అప్పగించాల్సిందే – లావణ్యకు హై కోర్ట్ బిగ్ షాక్

M HANUMATH PRASAD