అసిస్టెంట్ excise superintendent సిద్దిపేట గారి ఆదేశాల మేరకు, సిద్దిపేట Dtf, SHO గజ్వెల్ నెంటూరు గ్రామం, వర్గల్ మండలంలో దాడులు నిర్వహించగా, గౌరయ్యగారి ప్రకాష్ గౌడ్ ఇంట్లో 330గ్రాముల అల్ఫ్రాజోలమ్ దొరికింది, ఇట్టి అల్ఫ్రాజోలంను కొత్తపల్లి గ్రామం, రాయపోలు మండలంనకు చెందిన కొత్తపల్లి సత్యనారాయణ నుండి కొనుగోలు చేసానని తెలపగా సత్యనారాయణ ను కూడా అరెస్ట్ చెసి కరీంనగర్ జైలు కు తెలించినట్లుగా తెలిపారు. ఇట్టి సీజ్ చేసిన అల్ఫ్రాజోలం విలువ మార్కెట్లో 3,30,000/- రూ. ఉంటుందని తెలిపినారు. ఈ దాడుల్లో CI లు k. శ్రీధర్, బ్రహ్మానందరెడ్డి, SI లు A. సాయికృష్ణ, A. శ్రీనివాస్, హెడ్ కాన్స్టేబుల్ లుచెన్నైగౌడ్, సోమయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.
