Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

సిరాజ్ ఖాతాలో అంత నగదు ఎక్కడి నుంచి వచ్చింది?

పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు విజయనగరానికి చెందిని సిరాజ్ ను, హైదరాబాద్ కు చెందిన సమీర్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

సిరాజ్ బ్యాంకు ఖాతాలో నలభై లక్షల రూపాయలకు పైగానే ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అయితే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. సిరాజ్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా ఈ డబ్బు సిరాజ్ కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.సిరాజ్ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు, పోలీసులు ఇంత డబ్బును సిరాజ్ ఎక్కడి నుంచి తెచ్చారని, అందులోనూ జాతీయ బ్యాంకుల్లో కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో వేయడానికి కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు.

నలభై రెండు లక్షల రూపాయలు…నలభై రెండు లక్షల రూపాయల వరకూ ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరపాలని నిర్ణయించారు. దీంతో పాటు సిరాజ్ పేరిట ఏ ఏ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి? ఏ బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయన్న దానిపై ముందుగానే అనుమానించిన అధికారులు అన్ని బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. తమ అనుమతి లేకుండా లాకర్లు ఓపెన్ చేయవద్దని బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే సిరాజ్ తండ్రి డీసీసీబీ బ్యాంకు కు వెళ్లి లాకర్ ను తెరవాలని కోరినట్లు తెలిసింది. అయితే బ్యాంకు అధికారులు అంగీకరించకపోవడంతో తాను పోలీస్ యూనిఫామ్ లో కూడా వెళ్లి అడిగారని చెబుతున్నారు. ఎవరు జమ చేశారు?అయినా ఒప్పుకోకపోవడంతో సిరాజ్ తండ్రి వెనుదిరిగాడు. సిరాజ్ తో పాటు అతని కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్ల వివరాలను నుకూడా అందచేయాలని బ్యాంకు అధికారులను ఎన్ఐఏ అధికారులు కోరారు. అసలు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సిరాజ్ బ్యాంకు ఖాతాయే మాత్రమే కాకుండా ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. కొత్త వలసలో ఉన్న అకౌంట్ ను తర్వాత సిరాజ్ విజయనగరానికి మార్చుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సిరాజ్ తన ఖాతాల్లో నగదు జమ చేయడం తప్ప విత్ డ్రా అనేది చేయడం జరగలేదని, ఈ మొత్తం సిరాజ్ కు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నిధులు పంపారన్న దానిపై లోతుగా విచారణ జరపాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు. విడతల వారీగా ఈ నగదు జమ చేసినట్లు తెలిసింది. ఫ్యామిలీ మొత్తానికి చెందిన బ్యాంకు ఖాతాల్లో దాదాపు డెబ్భయి లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Related posts

S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు

M HANUMATH PRASAD

ఛీ.. ఛీ.. నడి రోడ్డు మీద యువతి పెదాలపై ముద్దులు.. వెలుగులోకి కామాంధుడి పైత్యం.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD

ఇంటి దొంగను పట్టేశారు

ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD

ఈడీ’ అన్ని హద్దులు దాటుతోంది: సుప్రీంకోర్టు

M HANUMATH PRASAD

భారత జవాన్ను విడిచిపెట్టిన పాకిస్తాన్..

M HANUMATH PRASAD