Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

సారీ.. మోదీ మా పఠాన్ రాడు.. సీఎం మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఆపరేషన్ సిందూర్ ఔట్రిచ్ కార్యక్రమంపై ఆమె సెటైర్లు వేశారు.

టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ను తమకు తెలియకుండా ఎలా ఎంపిక చేశారంటూ ప్రశ్నలు సంధించారు. యూసఫ్ ఈ డెలిగేషన్ నుంచి తప్పుకుంటారంటూ సీఎం మమత ప్రకటించారు. తమ పార్టీని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందని మమత చెప్పుకొచ్చారు. తృణమూల్ ఏ ప్రతినిధి పంపాలో కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని సీఎం ప్రశ్నించారు. కాగా కేంద్ర ప్రభుత్వం 7 అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పర్యటనకు పంపనున్నట్లు ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పఠాన్, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు.

అఖిలపక్ష బృందంలో

విదేశాలకు వెళ్లే మోడీ ప్రభుత్వ అఖిలపక్ష బృందంలో బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్కు చెందిన శశి థరూర్, జెడియుకు చెందిన సంజయ్ కుమార్, డిఎంకెకు చెందిన కనిమొళి, ఎన్సిపి-ఎస్పికి చెందిన సుప్రియా సులే, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే ఉన్నారు. వారందరూ వేర్వేరు ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహిస్తారు. మొత్తం 51 మంది రాజకీయ నాయకులను విదేశాలకు పంపుతున్నారు. ఈ ప్రతినిధులు 32 దేశాలతో పాటు బ్రస్సెల్స్లోని యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు.

ఈ ప్రతినిధి బృందంలో మాజీ కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్ , ఎంజె అక్బర్, ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సల్మాన్ ఖుర్షీద్ , ఎస్ఎస్ అహ్లువాలియా కూడా ఉన్నారు .వారందరూ ప్రస్తుతం పార్లమెంటు సభ్యులు కారు. విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, అలాంటి విషయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆదివారం అన్నారు

Related posts

అలాంటి పదవులేవి నాకొద్దు.. CJI సంజీవ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టులో సీజేఐపై దాడికి యత్నం

M HANUMATH PRASAD

బెంగళూరు ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు ప్రశంసలు

M HANUMATH PRASAD

బలోచిస్థాన్‌’పై సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

M HANUMATH PRASAD

ఇండియాలో ఉండి లేకి పాక్ కు సపోర్ట్ చేసేవాళ్లు.. చూడాల్సిన వీడియో ఇది!

M HANUMATH PRASAD

తప్పించుకోబోయే తెగించి ప్రాణం తీసుకున్నాడు