పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం (Government of India) కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఆర్మీకి అన్ని రకాల స్వేచ్ఛ ఇచ్చింది.
అలాగే జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ (Search operation)ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ (Two terrorists arrested) చేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్ (Search operation) డీకే పోరా ప్రాంతంలో జరిగింది. ఇందులో రెండు పిస్టల్స్, నాలుగు గ్రనేడ్‌లు, 43 లైవ్ రౌండ్లు, ఇతర ఆయుధ సామాగ్రి భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రశ్నిస్తున్నారు. అలాగే షోపియాన్ (Shopian) ప్రాంతంలో భారీ ఎత్తున ఈ సెర్చ్ ఆపరేషన్ (Search operation) కొనసాగిస్తున్నారు.
