Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ధనుంజయ్ రెడ్డిపై వైసీపీలో ఇంత వ్యతిరేకతా

వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో సీఎంవోలో చక్రం తిప్పిన ధనుంజయ్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పుడు బయటపడుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ముఖ్యనేతలంతా ఆయనకు అలా జరగాల్సిందేనని సెటైర్లు వేసుకుంటున్నారు

ధనుంజయ్ రెడ్డికి మద్దతుగా కొంత మంది గుంటూరు, కృష్ణ నేతల్ని కోర్టు వద్దకు జగన్ పంపించారు కానీ వారుకూడా మనస్ఫూర్తిగా వెళ్లలేదు.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కోసం ఎమ్మెల్యేలను ఎంపీలను.. ఇతర ముఖ్యనేతల్ని ఎప్పుడూ మనుషులుగా చూడలేదన్న అసంతృప్తి ఉంది. రోజంతా కూర్చోబెట్టి.. తర్వాత చూద్దామని చెప్పి పంపించిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఎవర్నీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లనిచ్చేవారు కాదు. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జక్కంపూడి రాజా లాంటి వారు ధనుంజయ్ రెడ్డి టార్గెట్ గానే విమర్శలు చేశారు. చాలా మంది మైకులు లేనప్పుడు ప్రైవేటు సంభాషణల్లో ధనుంజయ్ రెడ్డిని బూతులు తిడుతూంటారు.

ఇప్పుడు ఆయన జైలుకు పోవడంతో వైసీపీ నేతల్లో చాలా మంది ఈగో శాటిస్ ఫై అయింది. చాలా రోజుల్లో జైల్లోఉండాలని వారు కోరుకుంటున్నారు. ఒక్కొక్కరు తమకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటున్నారు. ఓ అధికారిగా పని చేసిన వ్యక్తిగా ఇంతగా వ్యతిరేకత పెరగడం అసాధారణం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Related posts

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

M HANUMATH PRASAD

కమ్యూనిస్టులకు పట్టిన గతే టిడిపికి.. సీనియర్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

M HANUMATH PRASAD

స్నానానికి వెళ్ళి సముద్రంలో ఇద్దరు గల్లంతు

M HANUMATH PRASAD

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

GIT NEWS

త్వరలో అమరావతి ‘మూడో దశ’.. ఏంటిది?

M HANUMATH PRASAD

కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా?

M HANUMATH PRASAD