తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ( chennai) అరుదైన సంఘటన జరిగింది. చెన్నైలోని ఓ రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. చెన్నై తారామణి రహదారిపై…సంఘటన జరిగింది. ఆ సమయంలో ఆ రోడ్డుపై నుంచి వెళ్తున్న కారు ( Car )… గుంతలో పడిపోయింది. సినిమా రేంజ్ లో… రోడ్డుకు గుంత పడడం.. వెంటనే కారు కూడా పడిపోవడం జరిగిపోయాయి.
ఈ సంఘటన చూసి స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సినిమాల్లో గ్రాఫిక్స్ కు మించిపోయేలా ఈ సంఘటన జరిగిందని షాక్ అయ్యారు. అయితే ఈ సంఘటన జరగగానే వెంటనే… ట్రాఫిక్ అధికారులు అలర్ట్ అయ్యారు. గుంతలోపడ్డ కారును బయటకు తీశారు.
అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లని వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. అయితే రోడ్డుపై గుంత పడడంతో… భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం ( chennai rains) కారణంగా రోడ్డు కుంగినట్లు.. అయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.