Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

నలుగురు కాంగ్రెస్ ఎంపీల పేర్లు ఇచ్చిన ఖర్గే.. శశిథరూర్ ను ఎంపిక చేసిన కేంద్రం

ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

ఇందుకోసం తమ తమ పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాలని కోరింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీల పేర్లతో కూడిన ఓ జాబితాను కేంద్రానికి సమర్పించింది. ఇందులో ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పేరు లేనేలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నుంచి శశిథరూర్ ను ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా ప్రతినిధి బృందానికి ఆయననే నాయకుడిగా చేసింది.ప్రతినిధి బృందం కోసం నలుగురు సభ్యుల పేర్లను సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదే రోజు మధ్యాహ్నానికి ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ ల పేర్లను కాంగ్రెస్ తరఫున పంపించినట్లు తెలిపారు. ఈ జాబితాలో శశి థరూర్ పేరు చేర్చలేదు. అయితే, తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Related posts

పాక్‌ సైన్యానికి సపోర్ట్‌గా సోషల్‌ మీడియా పోస్టులు.. గవర్నమెంట్ టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు..!

M HANUMATH PRASAD

ఈవెంట్ లో సృహ తప్పి పడిపోయిన హీరో విశాల్

M HANUMATH PRASAD

సీజేఐకి అవమానం ?మొహం చాటేసిన సీఎస్, డీజీపీ-నీతులపై గవాయ్ ఫైర్..!

M HANUMATH PRASAD

కోల్‌కతాలో 150 మంది మాజీ టీచర్ల అరెస్ట్‌

M HANUMATH PRASAD

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసన

M HANUMATH PRASAD

అందరూ చూస్తుండగానే, నాలుగు నెలల చిన్నారిని కొరికి చంపేసిన పెంపుడు కుక్క..!

M HANUMATH PRASAD