పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీకి వీడ్కోలు దక్కకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పదవీ విమరణ చేసే న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అయితే, జస్టిస్ బేలా త్రివేదీ కోసం అలాంటి కార్యక్రమాన్ని ప్రకటించకపోవడాన్ని సీజేఐ గవాయ్ శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ‘అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను బహిరంగంగా ఖండిస్తున్నాను.
ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తగదు’ అని పేర్కొన్నారు. జస్టిస్ మాసిహ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. వీడ్కోలు సభ ఏర్పాటు చేయకపోవడంపై తాను చింతిస్తున్నానని, సంప్రదాయాన్ని అనుసరించాల్సిందేనని, దానిని గౌరవించాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. జస్టిస్ త్రివేదీ లాంటి వారు న్యాయవ్యవస్థకు విలువైన ఆస్తి అని పేర్కొన్న సీజేఐ పేర్కొన్నారు. జస్టిస్ త్రివేదీ కఠినమైన న్యాయమూర్తిగా పేరు పొందారు.