Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

కాంగ్రెస్ కు అధికారం కష్టమే: చిదంబరం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని, ఆ పార్టీ కోసం చాలా వ్యవస్థలు పనిచేస్తున్నాయని మాజీ కేంద్రం మంత్రి పీ చిదంబరం అన్నారు.

2029 లోనూ ఇండియా కూటమి ప్రతిపక్ష స్థానంలోనే ఉంటుందని, ఈ విషయం రాహుల్ గాంధీ సన్నిహితులకు కూడా తెలుసని అన్నారు. రెండు ప్రధానమైన రాజ్యాంగ సంస్థలు బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్నాయని ఆరోపించారు. అందులో మొదటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. భారత దేశంలో ఎన్నికలు జరిగితే అధికార పక్షానికి 98% ఓట్లతో ఏ పార్టీ కూడా గెలవదని అన్నారు. ఇక్కడి పరిస్థితులు వేరని చెప్పారు. ప్రతిపక్షానికి 20 నుంచి 24% ఓట్లు వస్తాయని తెలిపారు.

ఇండియా కూటమిలో లుకలుకలు

కూటమి అతుకులు కదులుతున్నట్టు, దారాలు ఊడిపోతున్నట్టు కనిపిస్తోందని చిదంబరం అన్నారు. దానిని సరిదిద్దడానికి ఇంకా సమయం ఉందని, తిరిగి బలోపేతం చేయవచ్చని వ్యాఖ్యానించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, కీలకమైన సమావేశాలు జరగకపోవడం వంటి అంశాలపై ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు తరచూ సమావేశమవుతూ వ్యూహరచన చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ, ఇండియా కూటమిలో అలాంటి ప్రయత్నాలు కొరవడ్డాయని చిదంబరం పరోక్షంగా సూచించారు.

Related posts

బక్రీద్ వేళ జంతు వధ వద్దు.. ముస్లింలకు హిందూ మత సంస్థ అపీల్

M HANUMATH PRASAD

అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా చంపేస్తాం: యోగి ఆదిత్యనాథ్

M HANUMATH PRASAD

రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన ప్రాపర్టీ మీ సొంతం కాదు…సుప్రీం కోర్టు తాజా తీర్పు ఏం చెబుతోంది..

M HANUMATH PRASAD

ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD

బాబోయ్ పులి తినేసింది

M HANUMATH PRASAD

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

M HANUMATH PRASAD