Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

Borugadda Anil Bail: బోరుగడ్డకు బెయిల్‌

అనంతపురం త్రీటౌన్‌ సీఐ మురళీకృష్ణను బెదిరించిన కేసులో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో విచారణ కోసం అనంతపురం జిల్లా జైలు నుంచి బోరుగడ్డ అనిల్‌ను గురువారం స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (మొబైల్‌ కోర్టు) కోర్టులో హాజరుపరిచారు.

ఇన్‌చార్జి న్యాయాధికారి హారిక రావూరి.. బోరుగడ్డకు బెయిల్‌ మంజూరు చేశారు. పోలీసులు సరైన సాక్ష్యాధారాలు చార్జ్‌షీట్‌లో పొందుపరచలేకపోయారని, కేసు కొట్టివేయాలని అనిల్‌ తరఫు న్యాయవాది నారాయణరెడ్డి డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. ఇదివరకే ఫోర్త్‌టౌన్‌ స్టేషన్‌లో నమోదైన కేసులోనూ బెయిల్‌ రావడంతో అనంతపురంలో నమోదైన రెండు కేసుల్లోనూ బోరుగడ్డకు బెయిల్‌ లభించినట్లయింది.

Related posts

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి

M HANUMATH PRASAD

విజయసాయి.. చంద్రబాబుకు లొంగిపోయాడు..

M HANUMATH PRASAD

రేషన్ డోర్ డెలివరీ: వైసీపీని తిట్టిపోస్తున్న జనం

తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి

M HANUMATH PRASAD

పని చేస్తే నే ఇంకొక సారి అవకాశం లేదంటే ఇంటికే -క్యాడర్ కి క్లాస్ పీకిన చంద్రబాబు

M HANUMATH PRASAD

ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..ఇక ముట్టుకుంటే షాక్.. నెలవారీ బిల్లు చూస్తే ఇక అంతే?