Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం!

సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah), పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీల (Mehbooba Mufti) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి వైఖరిని ప్రశ్నిస్తూ ముఫ్తీ విమర్శలు గుప్పించారు. ఇందుకు దీటుగా బదులిచ్చిన సీఎం.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సరిహద్దు అవతల ఉన్నవారి కోసం ఆమె ఆలోచిస్తున్నారు తప్ప, ఇక్కడి ప్రజల సంక్షేమం పట్టడం లేదంటూ మండిపడ్డారు.

ఈ ప్రాజెక్టు పునరుద్ధరిస్తే..

సింధూ ఒప్పందం అమలు నిలిపివేత దృష్ట్యా.. వులర్‌ సరస్సుపై గతంలో తలపెట్టిన ‘తుల్‌బుల్‌’ బ్యారేజీ ప్రాజెక్టు పునరుద్ధరణపై ఒమర్‌ మాట్లాడారు. ”1980ల్లో ఇది ప్రారంభమైంది. ఒప్పందం పేరు చెప్పి పాకిస్థాన్‌ ఒత్తిడి తేవడం వల్ల ఇన్నేళ్లుగా దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్‌ కోసం జీలంను ఉపయోగించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా దిగువన ఉన్న ప్రాజెక్టులతో విద్యుత్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది” అని సీఎం ఒమర్‌ పేర్కొన్నారు.

సీఎం ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయంపై పీడీపీ అధినేత మెహబూబా స్పందిస్తూ.. ”ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. అవి బాధ్యతారహిత వ్యాఖ్యలే కాకుండా ప్రమాదకరంగా, ప్రేరేపించేలా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను మరింత రెచ్చగొట్టేందుకు ఒమర్‌ ప్రయత్నిస్తున్నారు. అత్యంత అవసరమైన, జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం. అంతేకాకుండా ద్వైపాక్షిక అంశాలను అంతర్జాతీయంగా మార్చే ప్రమాదం ఉంది” అని ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు.

ముఫ్తీ వ్యాఖ్యలను సీఎం ఒమర్‌ అబ్దుల్లా తిప్పికొట్టారు. ఈ ఒప్పందం జమ్మూకశ్మీర్‌కు చారిత్రక ద్రోహమని అంగీకరించేందుకు ముఫ్తీ నిరాకరిండం.. చౌకబారు పబ్లిసిటీ చేసుకొనే ప్రయత్నంలో భాగమన్నారు. సరిహద్దు అవతల ఉన్న కొంతమంది ప్రయోజనం కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. సింధూ జలాల ఒప్పందం (IWT)ను తాను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నానని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని చెప్పారు.

Related posts

నన్ను పెళ్లి చేసుకోండి…: పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా… వెలుగులోకి షాకింగ్ విషయాలు…!

M HANUMATH PRASAD

నలుగురు కాంగ్రెస్ ఎంపీల పేర్లు ఇచ్చిన ఖర్గే.. శశిథరూర్ ను ఎంపిక చేసిన కేంద్రం

M HANUMATH PRASAD

మోడీ ఆత్మవిశ్వాసం దెబ్బతింది, బీజేపీ ఓటమి తప్పదు.. ”ఓట్ చోరీ” ర్యాలీలో రాహుల్ గాంధీ

M HANUMATH PRASAD

భారత జవాన్ను విడిచిపెట్టిన పాకిస్తాన్..

M HANUMATH PRASAD

బదిలీపై వెళ్తున్న పోలీస్.. వెళ్లొదంటూ వెక్కివెక్కి ఏడ్చిన జనం.. వైరల్‌ అవుతున్న వీడియో!

M HANUMATH PRASAD

ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD