తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం కేసులో (Obulapuram Mining Scam) గతవారం గాలి జనార్థన్ రెడ్డి (Gali Janardhan Reddy)కి 7 సంవత్సరాలు జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే
ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జైలులో తనకు స్పెషల్ కేటగిరి కల్పించాలని కోరుతూ తన తరపు లాయర్ల ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో గాలి జనార్థన్ రెడ్డి నిరాశ ఎదురైంది. శిక్ష పడిన నేరస్తులకు జైళ్లలో స్పెషల్ కేటగిరి రిలీఫ్ ఉండదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
కాగా.. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డితో పాటు.. మరో నలుగురికి శిక్ష విధించింది. శిక్ష విధించే ముందు కోర్టు.. గాలి సహా మిగతా నలుగురిని ఇంకా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. తాను చేసిన సామాజిక సేవల్ని గుర్తించి శిక్షను తగ్గించాలని కోరగా.. న్యాయస్థానం పదేళ్ల నుంచి ఏడేళ్లకు శిక్షను తగ్గిస్తూ.. తుది తీర్పును వెల్లడించింది.
