Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో 200 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు పరారయ్యారు.

బాధితులు గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కలిసి మాదాపూర్ లో కొన్ని నెలల కింద స్కిల్ హబ్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. జాబ్ పోర్టళ్ల ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను సంప్రదించి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నమ్మించారు.

ప్యాకేజీల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 200 మంది నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. గచ్చిబౌలి ప్లాటినం బిల్డింగ్​తొమ్మిదో అంతస్తులోని వ్యూరోపోల్ క్రియేటివ్స్ అండ్ ఐటీ సొల్యూషన్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారు. మూడు నెలల ట్రైనింగ్ తర్వాత పర్మినెంట్​చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఏడాది బాండ్ రాయించుకున్నారు. రెండు నెలలు ట్రైనింగ్​ఇచ్చి, కొంతమందికి వేతనాలు ఇచ్చారు. మరికొందరికి ఇవ్వలేదు.

రోజూ మాదిరిగా మే 7న ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు తాళం వేసి ఉండడాన్ని గుర్తించారు. సెక్యూరిటీని అడగ్గా సదరు కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు చెప్పారు. మోసపోయామని గుర్తించిన నిరుద్యోగులు గురువారం ఆప్​రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ తో కలిసి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఎంపిక చేసిన స్కిల్ హబ్ కన్సల్టెన్సీ, వ్యూరోపోల్ సంస్థ ఒకే వ్యక్తికి చెందినవని,మాదాపూర్ కు వెళ్లగా కన్సల్టెన్సీ సైతం మూసివేసి ఉందన్నారు.

Related posts

హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD

వాళ్ళు తరగతులు నిర్వహించుకుంటే మీకెందుకయ్య బాధ-పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

M HANUMATH PRASAD

ఒకేసారి 2 సిగరెట్లు తాగిపారేసిన సేలం టీచర్.. 10 సవర్ల బంగారు బ్రేస్‌లెట్, సీఈఓ ప్రియుడు

M HANUMATH PRASAD

డిల్లీ తెలంగాణ భవన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఆమోదం

M HANUMATH PRASAD

రేపటి నుంచి స్లాట్ బుకింగ్

M HANUMATH PRASAD