Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం

కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం..

కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లో సంవత్సరం కావస్తుంది.. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, విశ్వసనీయత, ప్రజల కొనుగోళ్లు అన్ని బాగున్నాయి.. రాష్ట్రం అభివృద్ధి చెందింది.. కూటమి ఏడాది పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం తిరోగమనం దిశగా అడుగులు వేస్తుందని విమర్శించారు.. వైఎస్‌ జగన్ ను ఏ విధంగా ఇబ్బంది పెడదాం అనే ధ్యాస తప్ప ప్రభుత్వానికి ఏమీ లేదు.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ఏమీ లేదు.. ప్రజలు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు అన్నారు అంబటి.

వైఎస్‌ జగన్ మొదట బిజినెస్‌లో భాగంగా భారతి సిమెంట్ ను ప్రారంభించారు. లేని పోనీ కారణాలు చూపించి భారతి సిమెంట్ సంస్థ సెక్రెటరీ బాలాజీ గోవిందప్పను విజయవాడ జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఐజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీ ప్రతినిధులను భయపెడితే ఏ విధంగా ఏపీకి పరిశ్రమలు వస్తాయి.? అని ప్రశ్నించారు.. రౌడీ మాములు ఇవ్వకపోతే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వమని కూటమి ప్రజా ప్రతినిధులు తెగేసి చెప్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రజా ప్రతినిధులు బరితెగించి మరి దోచుకుంటున్నారు. కప్పం కట్టలేదని పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు సిమెంట్ కంపెనీలు మూసేయించాడు అని ఫైర్ అయ్యారు.. జాతీయ రహదారి కాంట్రాక్ట్ ల కోసం సీఎం రమేష్ , నారాయణరెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు కొట్టుకుంటున్నారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసి, ఏడాది పాలన పూర్తి చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామని బాధ పడుతున్నారు.. గత ఐదేళ్ల వైసీపీనే బాగుంది అని ప్రజలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. ఇక, రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి రెవిన్యూ తగ్గిపోయిందన్న రాంబాబు.. మోసానికి మారుపేరు చంద్రబాబు. అసలు ఒక పథకం అమలు చేయడానికి ఎంత బడ్జెట్ కావాలి, మీరు కేటాయిస్తుంది ఎంత..? అని ప్రశ్నించారు.. ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి..? అని నిలదీశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..

Related posts

ఏపీలో ఆకాశం నుంచి కింద పడుతోన్న మేఘాలు.. వైరల్ అవుతోన్న వీడియోలు. ఇంతకీ ఏం జరుగుతోంది.?

M HANUMATH PRASAD

కూటమికి షాక్, 30 మంది వైసీపీలో చేరిక

విలేఖరి హత్యకేసులో మాజీ MLA., పాత్ర?

M HANUMATH PRASAD

విజయసాయి.. చంద్రబాబుకు లొంగిపోయాడు..

M HANUMATH PRASAD

హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు

M HANUMATH PRASAD

మతం మారితే రేజర్వేషన్లు ఉండవు, రెండు కావాలంటే కుదరదు ఏపీ హైకోర్టు ధ్రువీకరణ