Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు..

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు..
సుమారు 29 తులాల బంగారం, 47 తులాల వెండి, నగదు 4 లక్షలు, స్ప్లెండర్ బైక్ స్వాదీనం, పోలీసుల అదుపులో నలుగురు నిందితులు.*
వివరాలు వెల్లడించిన సంగారెడ్డి డియస్పీ సత్త్యయ్య గౌడ్.*

ఈ సందర్భంగా సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు డియస్పీ గార్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పగలు, రాత్రి దొంగతనాలు నివారించాలనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపి‌ఎస్ గారి ఆదేశానుసారం సంగారెడ్డి డియస్పీ ఆద్వారంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ రోజు తేదీ: 14.05.2025 నాడు ఉదయం అందజ 6 గంటల సమయంలో సంగారెడ్డి బైపాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఒక ఆటొ నెంబర్ AP 23 TA 0092 గల దానిలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వెల్లుతుండగా ఆటొను ఆపే క్రమంలో నలుగురు వ్యక్తులు ఆటొ దిగి పారిపోతుంటే వారిని పోలీసు వారు వెంబడించి పట్టుకొని పట్టుకోవడం జరిగింది.

* *నిందితుల వివరాలు:*
1) మార్ల యాదగిరి తండ్రి అడివయ్య, వ: 44 స,,లు, కులమ: వడ్డెర, వృతి: మేస్త్రి, H No. 4-2-130, రాజంపేట్, సంగారెడ్డి టౌన్ మరియు జిల్లా,
2) మైనర్ బాలుడు వయసు:17 -18
3) మార్ల అనిత భర్త యాదగిరి, వ,, 42 సo,,లు, కులo: వడ్డెర, వృతి: కూలి, H No. 4-2-130, రాజంపేట్, సంగారెడ్డి పట్టణం మరియు జిల్లా
4) తలారి లక్ష్మి భర్త భూమయ్య, వ,, 34 సo,,లు, కులo: తెనుగు, వృతి: కూలి, H No. 5-87, ముస్లాపూర్ గ్రామం, సంగారెడ్డి జిల్లా

*వివరాలలోనికి వెళ్ళితే* : ఒకే కుటుంబానికి చెందిన నిందితులు జల్సాలకు అలవాటు పడి, తప్పుడు మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలని పగలు రెక్కి నిర్వహించి, తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని, రాత్రి దొంగతనాలకు పాల్పడుతూ నలుగురు నిందితులు కలిసి జిల్లాలో హత్నూర, సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిదిలో ఈ సంవత్సరం 6 దొంగతనాలకు పాల్పడినట్లు, గతంలో సంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలైన వికారాబాద్, మోమిన్ పేట్ సైబరాబాద్ నర్సాపూర్ లలో నిందితుడు మార్ల యాదగిరి 35 దొంగతనాలు, మార్ల యాదగిరి మరియు మైనర్ నేరస్తుడు కలిసి 12 దొంగతనాలు మొత్తం 53 దొంగతనాలు చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. పై నిందితుల వద్ద నుండి 29 తులాల బంగారం, 47 తులాల వెండి, నగదు 4 లక్షలు, ఒక స్ప్లెండర్ బైక్ నెంబర్ TG 15 4822 స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.

ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సంగారెడ్డి రూరల్ సి.ఐ క్రాంతి కుమార్, ఎస్.ఐ రవీందర్ క్రైమ్ సిబ్బంది షాకిర్ నాగరాజు, రాజు, నర్సింలు లను డియస్పీ గారు అభినందించారు.

Related posts

ఆత్మాహుతికి సిద్ధమైన సమీర్‌, సిరాజ్‌! దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక

M HANUMATH PRASAD

జిల్లా ఇంచార్జి మంత్రుల పనితీరు బాగోలేదు -సీఎం రేవంత్ రెడ్డి

M HANUMATH PRASAD

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

M HANUMATH PRASAD

డిల్లీ తెలంగాణ భవన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఆమోదం

M HANUMATH PRASAD

డీఎస్పీ గా అవతారమెత్తిన కేటుగాడు అరెస్ట్

M HANUMATH PRASAD