Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి , డబ్బులియ్యాలి.. లేకపోతే కూల్చేస్తాం’ అంటూ ఓ ఇంటి యజమానిని బెదిరించిన వ్యక్తిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి కథనం ప్రకారం.. మూడు రోజుల కింద ఉప్పల్ మెయిన్ రోడ్డులో ఇల్లు కట్టుకుంటున్న బజార్ నవీన్ గౌడ్ కు తుల్జా సింగ్​అనే వ్యక్తి ఫోన్​చేశాడు. తాను బల్దియా హెడ్డాఫీస్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు.

ఇంటి నిర్మాణం చేసుకుంటే డబ్బులు ఇవ్వాలని తెలియదా? అంటూ ప్రశ్నించాడు. లేకపోతే ఇంటిని కూల్చివేయక తప్పదని వార్నింగ్​ఇచ్చాడు. ఇలాగే వేధిస్తుండడంతో నవీన్ ఉప్పల్​పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. కాగా, నిందితుడు తుల్జా సింగ్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ భర్త, కార్మిక నాయకుడు మోతె శోభన్ రెడ్డి దగ్గర డ్రైవర్​గా పని చేస్తున్నట్టు తెలిసింది.

Related posts

ఎట్టకేలకు కాకాణి అరెస్ట్..

M HANUMATH PRASAD

తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి

M HANUMATH PRASAD

వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదు: భార్య పంకజశ్రీ

M HANUMATH PRASAD

హంతకుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధించిన విశాఖ కోర్టు

M HANUMATH PRASAD

నంద్యాలకు కొత్త ఇంచార్జ్.. భూమా అఖిలప్రియ పరిస్థితి ఏంటి?

M HANUMATH PRASAD

వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోండి -డాక్టర్ సత్యనారాయణ మూర్తి

M HANUMATH PRASAD