Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

అందరూ చూస్తుండగానే, నాలుగు నెలల చిన్నారిని కొరికి చంపేసిన పెంపుడు కుక్క..!

గుజరాత్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని హాతిజాన్ ప్రాంతంలో, ఒక పెంపుడు కుక్క 4 నెలల చిన్నారిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది.

ఆ కుక్క అకస్మాత్తుగా క్రూరంగా మారి, అమాయక చిన్నారిని ముక్కలు ముక్కలుగా చీల్చి చంపేసింది. కుక్క దాడిలో బాలిక అత్త కూడా గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన తర్వాత, మరణించిన బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

పోలీసులు కుక్క యజమానిపై కేసు నమోదు చేశారు. మరోవైపు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని సిఎన్‌సిడి విభాగం బృందం ఆ క్రూరమైన కుక్కను బోనులో బంధించింది. హాథిజన్ ప్రాంతంలోని రాధే రెసిడెన్సీలో ఈ సంఘటన జరిగింది. ఒక పెంపుడు కుక్క 4 నెలల బాలికపై దాడి చేసింది. ఒక యువతి తన పెంపుడు కుక్క రోట్‌వీలర్‌తో బయటకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. నిర్లక్ష్యం ఏమిటంటే, ఆ అమ్మాయి ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఆ సమయంలో కుక్క ఆమె చేతుల నుండి జారుకుని, ఆమె ముందు ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసింది.

కుక్క ఒక్కసారిగా ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకువచ్చింది. ఇంతలో అత్తతో ఆడుకుంటున్న నాలుగు నెలల చిన్నారిపై దాడి చేసింది. ఆ కుక్క నుంచి అమ్మాయిని కాపాడటానికి వచ్చిన ఆమె అత్తపై కూడా దాడి చేసింది. రోట్ వీలర్ కుక్క దాడిలో బాలిక తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన CNCD విభాగం బృందం కుక్కను బోనులో బంధించి, కుక్క యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

రోట్‌వీలర్, పిట్‌బుల్, పోమెరేనియన్, జర్మన్ షెపర్డ్చ, డోబర్‌మాన్ వంటి కుక్క జాతులు దూకుడుగా ఉంటాయి. ఈ రకమైన కుక్కలను పెంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దూకుడుగా ఉండే కుక్కల యజమానులు వాటికి సరైన శిక్షణ ఇవ్వాలి. దూకుడు ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలని పశువైద్యులు చెబుతున్నారు. మొదటిసారి కుక్కను పెంచుకునే వ్యక్తులు దూకుడుగా ఉండే కుక్కను పెంచుకోవద్దంటున్నారు వైద్యులు. దూకుడుగా ఉండే కుక్కల యజమానులు ఈ కుక్కలకు సరైన శిక్షణ ఇవ్వాలి. ప్రవర్తన నిపుణుడి సహాయం తీసుకోవాలి.

Related posts

వడగళ్ల వానతో ఇండిగో విమానం ధ్వంసం.. వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో

M HANUMATH PRASAD

ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ ఇంజెక్ట్‌ చేసి రేప్‌ చేశాడు.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణ

M HANUMATH PRASAD

చార్ ధామ్ యాత్రలో అపశృతి.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్.. వీడియో ఇదే..

M HANUMATH PRASAD

పంజాబ్ నుంచి రాజ్యసభకు కేజ్రీవాల్?

M HANUMATH PRASAD

రియాద్‌ ఆసుపత్రిలో చేరిన గులాంనబీ ఆజాద్‌

M HANUMATH PRASAD

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు

M HANUMATH PRASAD