Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

14 మంది పాక్ సైనికులు హతం…వీడియో రిలీజ్ చేసిన బలూచ్

పాకిస్తాన్ నుంచి విడిపోవాలనే ఉద్దేశ్యంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేస్తూనే ఉంది.

ఆ మధ్య పాకిస్తాన్ రైలును కూడా హైజాక్ చేసింది. తాజాగా భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు మే తొమ్మిదవ తేదీన బలూచ్ ఆర్మీ పాక్ సైన్యంపై మరోసారి విరుచుకుపడింది. పాక్ లోని పంజ్ గర్ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్ పై కాల్పులు జరిపింది. ఆ తర్వాత బాంబులతో దాన్ని పేల్చేసింది. ఆ దాడిలో మొత్తం 14 మంది పాక్ సైనికులు మరణించారు. అలాగే పాక్ ఆర్మీ పోస్ట్ ల మీద కూడా కాల్పులు జరిపింది. ఆ దెబ్బకు పాక్ సైనికులు ఆర్మీ పోస్టులను వదిలి పరుగులు పెట్టారు. దీనంతటికీ సంబంధించిన తాజాగా బలూచ్ ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

స్వతంత్ర దేశంగా ప్రకటన..

భారత్, పాక్ కాల్పులు విరమణ తర్వాత కూడా బూలచ్ ఆర్మీ పాక్ సైన్యంపై దాడులు చేస్తూనే ఉంది. గత నాలుగు రోజుల్లో 71 ప్రాంతాల్లో దాడులు చేసింది. దాంతో పాటూ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. దశాబ్దాల హింస, మానవ హక్కుల ఉల్లంఘన నుంచి విముక్తి పొంది బలూచిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందిందని బలూచ్ నాయకుడు మీర్ యార్ అంటున్నారు. బెలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాక ఆయన సోషల్ మీడియాలో నిన్న భావోద్వేగ పోస్టును పెట్టారు. బెలూచిస్తాన్ ప్రజలు ఒక జాతీయ నిర్ణయం తీసుకున్నారని…దీనిపై ఇక ప్రపంచం మౌనంగా ఉండకూడదంటూ కోరారు. భారతదేశంతో సహా అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు కోసం ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి!

M HANUMATH PRASAD

భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

M HANUMATH PRASAD

పాక్ లో సంబరాలు

M HANUMATH PRASAD

కరాచీ ఎయిర్పోర్ట్ లో అద్వాన్న స్థితి -పాక్ నటి ఆరోపణ

M HANUMATH PRASAD

పాక్‌ నుంచి అఫ్గాన్‌ సరుకు ట్రక్కులకు అనుమతి

M HANUMATH PRASAD

అడ్రస్‌ లేకపోతే తిహాడ్‌ జైలులోనే ఉంటారు

M HANUMATH PRASAD