పాకిస్థాన్ డెత్ సెల్‌లో ఉన్న తమ తండ్రిని కాపాడాలి అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను వేడుకున్నారు.ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులైమాన్ ఖాన్ మాట్లాడుతూ..
తాము ట్రంప్‌తో ఇమ్రాన్‌ఖాన్‌ను విడిపించాలని కోరాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఎందుకంటే తమ తండ్రికి కూడా కనీస హక్కులు ఉన్నాయన్నారు.తమ తండ్రిని విడిపించుకునేందుకు వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని సమర్థించే ఏ ప్రభుత్వాన్ని అయినా మద్దతు కోరుతామని చెప్పారు. ముఖ్యంగా ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్ ట్రంప్‌ను కోరుతామన్నారు. ఇమ్రాన్ ఖాన్ డెత్ సెల్‌లో ఉన్నారని అందులో లైట్ లేదు, లాయర్ లేరు, డాక్టర్ లేరని చెప్పారు. ఆయనపై ఉన్న కేసులు పరిశీలిస్తే రాజకీయ కుట్ర పూరితమైనవి అని తేలిపోతుందని చెప్పాారు. ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని ఎవరైనా ప్రజలు తమ తండ్రి విడుదల కోసం సాయం చేయాలని అనుకుంటే సంప్రదించవచ్చని అన్నారు.
