Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

కర్రెగుట్టలో బారీ సంఖ్యలో మావోల మృతి

ఆపరేషన్ కగార్ లో భాగంగా గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా ఇప్పటి వరకూ 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న కూబింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇంత వరకూ 35 ఎన్ కౌంటర్లు జరిగాయి.

ఆఎన్ కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ వివరాలను బీజాపూర్ ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మరణించిన నక్సలైట్లలో 20 మందిని గుర్తించినట్లు తెలిపిన ఆయన ఆ గుర్తించిన వారి భౌతిక కాయాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్ల చెప్పారు. మరో 15 మందిని గుర్తించాల్సి ఉందన్నారు.

కాగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ లో 28 వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు వివరించారు. ఇలా ఉండగా పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత ఉత్పన్నమైన పరిణామాలతో కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేసి భద్రతా దళాలను దేశ సరిహద్దులకు తరలించేసిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్ గఢ్ లో మాత్రం ఆపరేషన్ కగార్ యథాతథంగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా శివారులోని అటవీ ప్రాంతంలోనూ, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని బామ్రాగఢ్ అడవుల్లోనూ ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం 30 మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

విజయనగరాన్ని సిరాజ్ ఎందుకు ఎంచుకున్నాడంటే?

M HANUMATH PRASAD

పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..: ప్రొఫెసర్‌పై సుప్రీం పైర్

M HANUMATH PRASAD

ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ ఇంజెక్ట్‌ చేసి రేప్‌ చేశాడు.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణ

M HANUMATH PRASAD

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

రాహుల్‌ ముఖానికి నల్ల రంగు పూస్తాం

M HANUMATH PRASAD

పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఏఎస్ ఓకా కీలక వ్యాఖ్యలు

M HANUMATH PRASAD