Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ… రాయపాటి శైలజ, పీతల సుజాత, హరి ప్రసాద్‌, తదితరులకు పదవులు… పూర్తి జాబితా ఇదే…

ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల కేటాయింపు కొనసాగుతోంది. కూటమి దశల వారీగా పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమన్వయంతో సీఎం చంద్రబాబు నామినేటెడ్ పదవులను మూడు పార్టీల నేతలకు కేటాయింపు చేస్తున్నారు.మినేటెడ్ పదవుల కేటాయింపు కొనసాగుతోంది. కూటమి దశల వారీగా పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమన్వయంతో సీఎం చంద్రబాబు నామినేటెడ్ పదవులను మూడు పార్టీల నేతలకు కేటాయింపు చేస్తున్నారు.

తాజాగా 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.అందులో 20 నామినేటెడ్ పోస్టులలో టీడీపీకి 17, జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయించారు. ఇక, అమరావతి జేఏసీ నేతలకు రెండు నామినేటెడ్ కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు పెద్ద పోరాటమే చేశారు. ఈ పోరాటంలో అమరావతి జేఏసీ నేతలు కీలకంగా వ్యవహరించారు. వారిలో రాయపాటి శైలజను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్మన్‌గా, ఆలపాటి సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించారు. నామినేటెడ్ పోస్టుల తాజా జాబితా ఇలా…1. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు ఛైర్మన్‌గా జెడ్ శివ ప్రసాద్ – టీడీపీ (నెల్లూరు సిటీ)2. ఆంధ్రప్రదేశ్ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎస్ రాజశేఖర్ – టీడీపీ (కుప్పం)3. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుగుణమ్మ – టీడీపీ (తిరుపతి) 4. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌గా వెంకట శివుడు యాదవ్ – టీడీపీ (గుంతకల్)5. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు ఛైర్మన్‌గా వలవల బాబ్జీ – టీడీపీ (తాడేపల్లిగూడెం)6. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా బురుగుపల్లి శేషారావు – టీడీపీ (నిడదవోలు)7. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా పితల సుజాత – టీడీపీ (భీమవరం)8. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా దివాకర్ రెడ్డి – టీడీపీతిరుపతి)9. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన – టీడీపీ (ఏలూరు)10. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ ఛైర్మన్‌గా రవి వేమూరు- టీడీపీ (తెనాలి)11. ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా మలేపాటి సుబ్బా నాయుడు – టీడీపీ (కావలి)12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా కేఎస్ జవహర్ – టీడీపీ (కొవ్వూరు)13. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్‌గా పెదిరాజు కొల్లు – టీడీపీ (నరసాపురం)14. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పేరేపి ఈశ్వర్ – టీడీపీ (విజయవాడ ఈస్ట్)15. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా మల్లెల ఈశ్వరరావు – టీడీపీ (గుంటూరు వెస్ట్)16. ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్‌గా ఆకాసపు స్వామి – టీడీపీ (తాడేపల్లిగూడెం) 17. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్‌గా లీలకృష్ణ – జనసేన పార్టీ (మండపేట )18. ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఛైర్మన్‌గా రియాజ్ – జనసేన పార్టీ (ఒంగోలు)19. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పసుపులేటి హరి ప్రసాద్ – జనసేన పార్టీ (తిరుపతి)20. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ ఛైర్మన్‌గా సోల్ల బోజ్జి రెడ్డి – బీజేపీ (రంపచోడవరం)21. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్మన్‌గా రాయపాటి శైలజ – అమరావతి జేఏసీ22. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆలపాటి సురేష్‌ – అమరావతి జేఏసీ

Related posts

సీఎం చంద్రబాబు తొందర పడుతున్నారు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు ముందు విడ్డూరపు నాటకం

M HANUMATH PRASAD

వైసీపీకి ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం

M HANUMATH PRASAD

మళ్లీ వైసీపీ రాదు. రానివ్వను.. పిచ్చి వేషాలేస్తే తొక్కినారా తీస్తా: పవన్ కళ్యాణ్

M HANUMATH PRASAD

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

GIT NEWS

ధనుంజయ్ రెడ్డిపై వైసీపీలో ఇంత వ్యతిరేకతా

M HANUMATH PRASAD