రాష్ట్రానికి సంబంధించిన జవాన్ మోహన్ (Jawan Mohan) సమస్యకు పరిష్కారం దొరికింది. ఏపీ జవాన్ మోహన్ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) ఎట్టకేలకు స్పందించారు.
జవాన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని మదనపల్లి ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషాకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దీంతో అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెమ్మ గారి పల్లెకు చెందిన ఆర్మీ జవాన్ మోహన్ ఇంటి సమస్య పరిష్కరించబడింది.
లోకల్ ఎమ్మెల్యేకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా జవాన్ తండ్రి బయ్యప్ప గారి కృష్ణప్పతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నారా లోకేష్ కు ( Nara Lokesh) ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. దీంతో వెంటనే ఆ జవాన్ తండ్రి కృష్ణప్పతో ఫోన్ లో మాట్లాడిన నారా లోకేష్… సమస్యను వెంటనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ఇది ఇలా ఉండగా.. చిట్టెమ్మ గారి పల్లెకు చెందిన జవాన్ మోహన్… కుటుంబానికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేశారని తెలుస్తోంది. తన భూమితో పాటు ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని… ఓ వీడియో ద్వారా మోహన్ స్పష్టం చేశాడు. తన భూమిని రక్షించాలని.. ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ వీడియో వైరల్ కావడంతో తాజాగా చంద్రబాబు నాయుడు స్పందించి.. రంగంలోకి దిగారు.