Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రీడా వార్తలు

బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా riyaan ?

భారత్, పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులలో ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పొరుగు దేశం పాకిస్తాన్ పూర్తిగా ఉలిక్కిపడి, భారత నగరాలపై నిరంతరం దాడులు చేసింది.వీటిని భారత్ ధీటుగా తిప్పికొట్టింది. ఇక శనివారం రాత్రి ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టాయి.

అయితే, భారతదేశంలో జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కూడా ఒక వారం పాటు వాయిదా పడింది. వారత తర్వాత ఈ టోర్నమెంట్ తిరిగి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ తర్వాత ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే, బంగ్లా పర్యటనకు భారత సి జట్టును బీసీసీఊ పంపవచ్చు అని వినిపిస్తున్నాయి. కారణం, భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది.

కెప్టెన్‌గా రియాన్ పరాగ్..!

భారత జట్టు ఆగస్టు 2025లో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. దీనిలో మూడు ODIలు, మూడు T20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో టీ20 జట్టుకు రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించవచ్చు అని తెలుస్తోంది. నిజానికి, అతను IPL 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత జట్టు అస్సాంకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా అతనికి ఉంది.

ఇది కాకుండా, ఈ సీజన్‌లో రియాన్ ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. IPL 2025లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో అతను 170.58 స్ట్రైక్ రేట్‌తో 377 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. పరాగ్ ఇటీవలి ఫామ్, కెప్టెన్సీ శైలిని పరిశీలిస్తే, అతను కెప్టెన్ కావడానికి బలమైన పోటీదారుడిగా పేరుగాంచాడు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తుఫాన్ ఫాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో, పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే నిలుపుకుంది. అందులో ప్రభ్సిమ్రాన్ సింగ్ పేరు కూడా ఉంది. ఈ సీజన్‌లో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 12 ఇన్నింగ్స్‌లలో 44.27 సగటు, 170.87 స్ట్రైక్ రేట్‌తో 487 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇటీవలి ఫామ్ చూస్తే బంగ్లాదేశ్ పర్యటనలో టీమ్ ఇండియాలో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేయడానికి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అతనికి అవకాశం ఇవ్వవచ్చు. అలాగే, ఈ జట్టులో చోటు సంపాదించడానికి బలమైన పోటీదారుల జాబితాలో అతను అగ్రస్థానంలో ఉన్నాడు.

మయాంక్ రీఎంట్రీ..!

టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున తిరిగి మైదానంలోకి వచ్చాడు. 2024లో భారతదేశాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా మయాంక్ యాదవ్ అకస్మాత్తుగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతను చాలా కాలం పాటు బీసీసీఐ వైద్య బృందం పరిశీలనలో ఉన్నాడు.

మయాంక్ ఫిట్ అయిన తర్వాత, బంగ్లాదేశ్ పర్యటనలో ఫాస్ట్ బౌలర్‌గా తిరిగి వచ్చే అవకాశాన్ని బీసీసీఐ మరోసారి ఇవ్వగలదు. గాయం తర్వాత అతని ఆటతీరు ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా, ఈ ఆటగాడు తన ప్రాణాంతక వేగంతో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌పై ఎంతటి విధ్వంసం సృష్టించగలడో భారత అభిమానులందరికీ తెలుసు.

 

 

 

Related posts

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు మరో ఎదురుదెబ్బ

గిట్ల ఆడినవ్ ఏంది కాకా..!!

వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు ఘోర అవమానం.. క్రికెట్‌లో ఒకే రోజు రెండు మిరాకిల్స్

ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలివే!

రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక ఓ బలమైన కారణం.. ఏం జరిగింది?

M HANUMATH PRASAD

రోహిత్ కాదు.. ఆ ఇద్దరి వల్లే కెప్టెన్‌గా నా పని ఈజీ అవుతోంది: హార్దిక్ పాండ్యా