Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలోనైనా సరే బాణాసంచా కాల్చడం పై నిషేధం ఉంటుందని తెలిపారు.

బాణాసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. బాణాసంచా కాల్చితే జైలుకు పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిషేధానికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే. హైదరా బాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం….

దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, నగరంలో భద్రతా చర్యలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాణాసంచా శబ్దాలు పేలుళ్లుగా అన్వయించుకునే ప్రమాదం ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశం ఉంది.

ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు. అంతేకాకుండా, బాణాసంచా శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో, బాణాసంచా కాల్చడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించడం కష్టమవుతుందన్నారు.

మరోవైపు నగరవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

సిపి సివీ ఆనంద్,భద్రతను ఎప్పటి కప్పుడు పర్యవే క్షిస్తున్నారు. బందోబస్తు పై పోలీసులకు సూచనలు ఇస్తున్నారు. ప్రజలు ఎలాంటి బయబ్రాంతులకు గురి కావద్దని ప్రజలకు ఆయన భరోసా కనిపిస్తున్నారు. అలాగే నగరంలో అనుమానాస్పద వ్యక్తులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.

ఈ ఆదేశాలను ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నిషేధాజ్ఞలు తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతాయని తెలిపారు..

Related posts

హైదరాబాద్ లో లైవ్ సెక్స్ దందా కు చెక్ పెట్టిన పోలీసులు

M HANUMATH PRASAD

మోదీ చెల్లని రూపాయి.. రాహుల్ నాయకత్వం దేశానికి అవసరం : రేవంత్

M HANUMATH PRASAD

వినాయకుని ఊరేగింపులో అపశృతి.. గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

M HANUMATH PRASAD

గాలికి బెయిల్ మంజూరు

M HANUMATH PRASAD

33 కాదు…17…రేవంత్ రెడ్డి మార్క్ జిల్లాలు

M HANUMATH PRASAD

గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, సీఎంలకు తాకుతుంది: రాజా సింగ్

M HANUMATH PRASAD