పాక్ సైన్యం విచ్చల విడిగా సరిహద్దు ప్రాంతాలలో జనావాసాలపై జరుపుతున్న కాల్పులకు ఒక నిబద్ధత గల అధికారి బలయ్యారు. వివరాలోకెళితే శనివారం తెల్లవారు జామున రాజౌరీ ప్రాంతంలో పాక్ కాల్పులకు తెగబడింది, ఈ కాల్పులలో రాజౌరీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజకుమార్ తప్పా అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఎంతో నిబద్ధత కలిగిన అధికారి మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి జమ్ముకాశ్మీర్ ముఖ్య మంత్రి ఒమర్ అబ్దుల్లా చేస్తూ ఒక ట్వీట్ చేశారు.
రాజకుమార్ తప్పా నిన్న అనగా శుక్రవారం తాను నిర్వహించిన ఆన్లైన్ సమావేశానికి హాజరయ్యారని, డిప్యూటీ సీఎం తో కలసి వివిధ ప్రాంతాల్లో తిరిగారని, ఈ రోజు మన మధ్య లేరని, పాక్ కాల్పులకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
