Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

పిలుపువస్తే యుద్ధానికి నేను సైతం- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

భారత్‌-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెల కొన్న వేళ దీనిపై తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయ న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను 16 ఏళ్లకే డిఫెన్స్‌లోకి వెళ్లానని తెలిపారు. 1982లో మిగ్ 21 ఫైటర్ ఫైలట్‌గా పని చేశానని చెప్పారు.

ఆ తర్వాత మిగ్ 23 అత్యాధునిక ఫ్లైట్ పైలట్‌గా పని చేశా. శబ్ద వేగానికి 2.5 రేట్లు ఎక్కువ వేగంతో మిగ్ 23 దూసుకెళ్తుంది. చాలా చిన్న వయస్సులో 20 ఏళ్లకే పైటర్ పైలట్ గా పని చేశా. కశ్మీర్ విషయంలో ఒక కీలక చర్య జరిగితే తప్ప రెండు దేశాల మధ్య సమస్య పరిష్కారం కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియా పరం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం.

పాకిస్థాన్ జమ్మూపై చేసిన దాడికి ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి చేయడం సరైన చర్య. యుద్ధం కొనసాగితే పాకిస్థాన్ పతనం అవుతుంది. మూడో దేశం ఏదీ కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాకపోవచ్చు. మా లాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే.. నేను వెళ్లడానికి సిద్ధం అని చెప్పారు.

ఏప్రిల్ 22న పాకిస్థాన్ ప్రేరేపిత చర్య చాలా దుర్మార్గం. మతం పేరు అడిగి చంపారు. ఈ ఘటనపై కశ్మీర్ సహా దేశమంతా ఏకతాటిపైకి వచ్చి ఖండించింది. టీఆర్ఎఫ్‌ అనేది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. పాకిస్థాన్ నిర్వాకా నికి దీటుగా బుద్ధి చెప్పడం సరైన చర్య. ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు, కామికసేన్ డ్రోన్ లు పనిచేశాయి.

భారత్ బోర్డర్ నుంచే రాఫెల్ యుద్ధ విమానాలు పని చేశాయి. రాఫెల్ విమానాలు వాళ్ల ఆర్మీ కూల్చివేసిందని పాక్‌ చెబుతున్న విషయం అబద్ధం. ఎందుకంటే.. రాఫెల్ బోర్డర్ దాటలేదు. పాక్.. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిలో ఉంది.

పాక్‌లో అంతర్గత కుమ్ము లాటలు ఉన్నాయి. పాక్ సృష్టించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ప్రాణ సంకటంగా మారారు. యుద్ధం చేయడం మన ఉద్దేశం కాదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే సైన్యం కొట్టేసింది. పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ పాక్ ఆర్మీ మాత్రమే పాక్‌ను నడిపి స్తుంది,అని చెప్పారు..

Related posts

వాళ్ళు తరగతులు నిర్వహించుకుంటే మీకెందుకయ్య బాధ-పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

M HANUMATH PRASAD

ఎమ్మెల్సీ కవిత అలా చెప్పింది.. ఎంపీ చామల షాకింగ్ కామెంట్స్

M HANUMATH PRASAD

చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు, మహిళపై లైంగిక వేధింపులు.. సీఐపై సస్పెన్షన్ వేటు

M HANUMATH PRASAD

పైసలిస్తేనే ఫైళ్ల పై మంత్రుల సంతకాలు…కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

చౌటపల్లిలో ఖబరస్థాన్ ఆక్రమణ.. మనోభావాలు దెబ్బతిన్నాయని ముస్లింల నిరసన

M HANUMATH PRASAD

హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

M HANUMATH PRASAD