ఒకపక్క సరిహద్దు ప్రాంతాల్లో ఫైరింగ్ చేస్తూనే జమ్మూ కాశ్మీర్ పఠాన్ కోట్ జలంధర్ రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో సైనిక స్థావరాల మీద దాడి చేసిన పాక్ సైన్యం ఆ దాడిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా పాకిస్తాన్ కి చెందిన ఫైటర్ జట్టు విమానాలు జే ఎఫ్ 17 లను నేల మట్టం చేయడమే కాకుండా తిరిగి లహర్ మరియు పాకిస్తాన్లోని లాహోర్ మరియు సీయోల్కోట్ రక్షణ స్థావరాల మీద దాడులు భారత్ సైన్యం చేసిన దరిమిల పాక్ సైన్యం అధికార ప్రకటన ఒకటి విడుదల చేసింది భారత సైన్యం తమ ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు మూడింటిని కూల్చివేసిందని ఈ దాడిలో తమ జవానులు కొంతమంది ప్రాణాలు కూడా విడిచారని తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని తాము యుద్ధం కోరుకోవడం లేదని పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది. పాక్ జరిపిన దాడుల్లో ఆస్తి నష్టం గాని ప్రాణనష్టంగాని ఏది జరగలేదని భారత రక్షణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ కి చెందిన పైలెట్ ని భారత సైన్యం అదుపులో తీసుకున్నట్టుగా తెలియ వచ్చింది.. ఈ విషయం భారత ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. భారత్ ఇప్పటికే పూర్తిస్థాయి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలియ వస్తుంది ఇప్పటికే లాహోర్, సీయోల్కోట్ తోపాటు ఇస్లామాబాద్, బహవల్పూర్ నగరాల మీద కూడా భారత ప్రతిదాడి చేస్తుంది. భారత్ జరిపిన ఈ దాడిలోపాకిస్తాన్ కు తీవ్ర ఆస్తి నష్టం ప్రాణం నష్టం కూడా జరిగినట్టు పాకిస్తాన్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.