పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి పై సందేహాలు వ్యక్తం చేస్తూ, హత్య చేసి యాక్సిడెంట్ గా చూపెడుతున్నారని దీనిమీద తక్షణం సిబిఐ ఎంక్వయిరీ జరిపి నిజాలు నిగ్గు తేల్చేలా చూడాలని కోరుతూ హై కోర్టు లో పిల్ వేసిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ K A పాల్ కు ఏపీ హై కోర్టు షాకిచ్చింది. డాక్టర్ కే ఏ పాల్ ఈ కేసును స్వయంగా వాదిస్తున్నారు. ఈ కేసు తాలూకు సీసీ ఫుటేజ్ లు మూడు నెలల్లో డిలీట్ అవుతాయని కాబట్టి సిసి ఫుటేజీలు భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును డాక్టర్ పాల్ కోరారు. మూడు నెలల్లో డిలీట్ అవుతాయని సీసీ పుటేజులు మీకు ఎవరు చెప్పారు, వాస్తవాలు తెలియకుండా వాదనలు చేయొద్దు అని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ పిల్ ని నిజాయితీగా వేశారని నిరూపించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆ తర్వాతే పిల్ ని పరిశీలిస్తామని డాక్టర్ పాల్ కి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఇప్పటికే ఈ కేసు విచారణలో కౌంటర్ దాకలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, హోంశాఖ కార్యదర్శి కి, డిజిపి కి సిట్ డిఎస్పి కి నోటీసులు హైకోర్టు జారీ చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్ర పోలీసులు ప్రవీణ్ పగడాల మద్యం మత్తులో బైక్ నడిపి యాక్సిడెంట్ కు గురయ్యినట్లుగా తేల్చేశారు. అయితే కొంతమంది క్రైస్తవ నాయకులు ఇది ముమ్మాటికి హత్యేనని వాదిస్తున్నారు, ఈ నేపధ్యంలోనే డాక్టర్ కె ఎ పాల్ హై కోర్టు లో పిల్ దాఖలు చేశారు
