ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వస్తున్నటువంటి ఒక కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.
ఓ కుటుంబం నల్గొండ నుంచి హైదరాబాద్కు తమ కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారు హయత్ నగర్ చేరుకోగానే ఆకస్మొక్కుగా మంటలు కారులో నుంచి చెలరిగాయి. తోటి ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారి చెలరేగిన మంటలను చూసి భయభ్రాంతులై పోయారు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అప్రమత్తమై సకాలంలో కారు నుంచి వైదొలిగిన పరిస్థితి. తృటిలో తప్పిన ప్రాణనష్ఠానికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ, అంతకంతకూ పెరుగుతున్నటువంటి మంటలను చూసి, ఏం చేయాలో తోచక నివ్వరపోయారు, ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్ళు చేస్తుండగా ఆ ప్రయత్నాలు ఏవి మంటలు నార్పలేకపోయాయి. చివరికి స్థానికులలో ఒకరు ఫైయర్ సిబ్బందికి ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి, ఆ కారులో ని మంటలను అదుపులోకి తేగలిగాయి, పూర్తిగా దగ్ధమైన కారును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కారు అద్దాలు టైర్లు సీట్లు మరియు ఇనుము పూర్తిగా దగ్ధం అయిపోయింది. ప్రయాణికులు కొంచెం ఆలస్యం చేసి ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అని యోచించి ఊపిరి పీల్చుకున్నారు.
*మంటలు చెలరేగడానికి కారణం*.
కారు ఉంది కదా అని దూర ప్రయాణాలు లేక దగ్గర ప్రయాణాలకు అన్నిటికీ ఉన్న కారుని వాడుతాం. దూర ప్రయాణాలకు ప్రయాణించే వాహనదారులు , సాధారణంగా ట్యాంక్ ఫుల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టిస్తుంటారు, దీనికి తోడు ఎండాకాలం కావడంతో వేడికి మంటలు ఎగిసే అవకాశం ఉంది.
డిజిల్ కానీ పెట్రోలు కానీ ఎప్పుడు కూడా ట్యాంక్ ఫుల్ గా కొట్టించవద్దని నిపుణులు తెలుపుతున్నారు. ట్యాంకులొ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 75% వరకు మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాలి మిగతా 25 శాతం ఖాళీగా ఉంచాలని సూచిస్తున్నారు. హైవే లో పెట్రోల్ బంకులు ప్రతి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మనకు అందుబాటులోకి ఉంటాయని, ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండపోదని వారు సూచించారు.
ఎలక్ట్రానిక్ కార్లు నడిపించే వాహనదారులు కూడా జాగ్రత్త పడాలని సూచించారు. కొంతమంది బ్యాటరీ చార్జింగ్ ఫుల్లుగా పెట్టి కారు నడుపుతూ ఉంటారు, ఆ పరిస్థితులలో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సర్వ సాధారణంగా కారులో దూర ప్రయాణం అంటే డ్రైవర్ మినహా మిగతావారు అందరూ నిద్రపోవడానికి ఇష్టపడతారు , ఇట్టి ప్రమాదం జరగనుందని ఎవరు ఊహించలేరు నిద్రలో ఉండగా ప్రమాదం జరిగితే, విషయం తెలుసుకునే లోగా ప్రమాదం ప్రాణానికి ముప్పు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తోటి ప్రయాణికులు స్థానికులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడం తో, చాలామంది తమ ఊర్లకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. కారు ప్రయాణంలో వెళ్లేవారు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సుఖ ప్రయాణంతో క్షేమంగా వారి వారి గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుందాం.
