శునకానికి ఉన్న విశ్వాసం ప్రపంచంలో ఏ జీవికి కూడా లేదు , విశ్వాసానికి మారు పేరే శునకం . హైదరాబాద్ మధుర నగర్ పరిధిలో ఎప్పుడు కుక్క యజమాని మీద దాడి చేసిన సంఘటన కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన పవన్ కుమార్ మరియు తన స్నేహితుడు సందీప్ కలిసి మధురానగర్ లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నారు. పవన్ కుమార్ ప్రైవేట్ ఆఫీసులో క్యాషియర్ కింద పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతనికి అనారోగ్యంగా ఉండటంతో తన స్నేహితుడు సందీప్ తో కలిసి హాస్పటల్ కి వెళ్లి వస్తున్నాడు. శనివారం సైతం వేరే ఆసుపత్రికి వెళ్లి వచ్చాడు. పవన్ కుమార్ తన గదిలోకి వెళ్లి నిద్రపోగా సందీప్ వేరే గదిలో పడుకున్నాడు. ఆదివారం ఉదయం సందీప్ పలుమార్లు డోరు కొట్టగా పవన్ ఎంతకీ ఓపెన్ చేయలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని సందీప్ పిలిచాడు, సాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. పవన్ మృతదేహం పక్కన కూర్చుని ఉన్న అతని పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉంది. పవన్ మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం అయినట్లు పోలీసులు గుర్తించారు పెంపుడు కుక్క అతని మర్మాంగాలు కొరికి తినడం వల్లే పవన్ మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే పవన్ కుమార్ వివాహం చేసుకోగా కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నట్టుగా తెలియ వచ్చింది. సందీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
previous post
next post
